మోడీ ప్రధాని అయ్యాక తీసుకున్న నిర్ణయాలలో అతి కఠినమైన నిర్ణయం పెద్ద నోట్ల రద్దు. నవంబర్ 8 -2016 తారీకున తీసుకున్న ఈ నిర్ణయం దేశమంతా సంచలనం సృష్టించింది. ఎంతోమంది ప్రముఖులు సామాన్యులు సైతం మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు..మరికొంతమంది తీవ్ర భావోద్వేగానికి లోనై మరణించడం కూడా జరిగింది. ఆ సమయంలో చాలామంది దాచుకున్న డబ్బు కోసం ఏటీఎమ్ మిషన్ దగ్గర పడిగాపులు కాస్తూ నిలబడరు.

Related image

ఆ సందర్భంలో ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ముసలి కన్నీరు కార్చారు. అంతేకాకుండా `నాకు 50 రోజులు సమయం ఇవ్వండి....ఒకవేళ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తప్పని తేలితే...నన్ను సజీవంగా కాల్చేయండి` అంటూ కన్నీటి పర్యంతమైన మోదీ విజ్ఞప్తి చేశారు. అయితే నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఐదు వందల రోజులు గడిచినా కానీ….తీసుకున్న నిర్ణయం వల్ల లాభం వచ్చిందో లేదో తెలియదు గానీ...ఇప్పటికీ దేశ ప్రజలు ఏటీఎమ్ మిషన్ ముందు నిలబడుతూ డబ్బు కోసం తెగ ఆపసోపాలు పడుతున్నారు.

Image result for modi

అయితే ఈ క్రమంలో దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నగదు కొరత ఉందంటూ చేసిన నిర్లక్ష్యపూరిత ట్వీట్ పై దేశ ప్రజలు అసహనం చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రధాని మోడీ పై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. భార్య పిల్లలు లేనివారు దేశాన్ని పరిపాలిస్తే ఇలాగే ఉంటుందని కొంతమంది అంటుంటే...

Image result for modi

మరికొంతమంది దేశాన్ని విభజించాలనే విద్వేషం కోపం మనసులో ఉంచుకొని పరిపాలిస్తే ఇలానే ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్ని 500 రోజులు బ్రతికిన మోడీ దేశ ప్రజల మంచితనాన్ని గుర్తించాలని అన్నారు. నిజంగా వేరే దేశస్థులు ఐతే మోడీని ఈపాటికి కాల్చి పారేసేవారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: