సినిమావాళ్లపై తప్పుడు  కథనాలు ప్రచారం చేస్తే తాట తీస్తా అంటూ హెచ్చరిస్తూ జీవితరాజశేఖర్ స్పందించడం ఇప్పుడు టాలీవూడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతవరకూ ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమ పెద్దలెవరూ ఈ స్థాయిలో స్పందించలేదు. రాజశేఖర్ వద్దకు అమ్మాయిలను పంపుతోందంటూ జీవితపై ఆరోపణలు రావడంతో ఆమె ఘాటుగా స్పందించాల్సి వచ్చింది. 

Image result for jeevitha rajasekhar casting couch

పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేదే లేదంటూ జీవిత రాజశేఖర్ హెచ్చరించారు. అంతే కాదుసినిమా అవకాశాలు టాలెంట్ ఉంటే వస్తాయన్నారు. వేషాలు కావాలని వచ్చే వారు డబ్బు పెడితే వీరందరినీ పెట్టి సినిమాలు తీస్తానని సెటైర్లు వేశారు జీవిత. అయితే జీవిత వ్యాఖ్యలపై అంతే ఘాటుగానూ సమాధానాలు వస్తున్నాయి. తనపై కేసు పెట్టిన జీవిత వ్యవహారంపై మహిళానాయకురాలు సంధ్య స్పందించారు. 

Image result for madhavi latha images

మహిళల హక్కుల సాధనలో ఇలాంటి కేసులు చాలా ఎదుర్కొన్నానని ఆమె అంటున్నారు. ఐతే.. జీవిత స్పందనపై హీరోయిన్ మాధవీ లత తాజాగా తన ఫేస్ బుక్ పేజీలో ఘాటుగా సమాధానమిచ్చింది. ఇన్నాళ్లు బయటికి రాని జీవితగారు ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చారు? ఆవిడ మీద ఆరోపణ వచ్చిందని వచ్చారా? అంటూ నిలదీసింది మాధవీలత. 

Image result for madhavi latha images
టాలెంట్ ఉంటే వెతికి పట్టుకుని అవకాశాలు ఇస్తామన్న జీవిత వ్యాఖ్యలను ఆమె వేళాకోళం ఆడారు.. హాహాహా.. ఈవిడని ఎవరు వెతికి పట్టుకున్నారట..?? అవకాశం ఇస్తే ఫ్రూవ్ చేసుకుంటారు. ఇవ్వకపోతే ఎలా వెతుకుతారు.. ఎలా వెతుకుతారు?? అంటూ కౌంట్ ఇచ్చింది. అంతే కాదు.. జీవిత అంటే ఇన్నాళ్లు గౌరవం ఉండేదని.. ఈ క్షణం ఆ గౌరవం కూడా పోయిందన్నారు. జీవిత స్పందనను తాను ఖండిస్తున్నానని పోస్ట్ చేసింది మాధవీలత. 



మరింత సమాచారం తెలుసుకోండి: