ఏపీ సీఎం చంద్ర‌బాబును సోష‌ల్ మీడియా ఓ ఆట ఆడేసుకుంటోందా?  కామెంట్ల‌తో కుమ్మేస్తోందా? ఎంతైనా బాబు బాబే అంటూ పెద‌వి విరుపు, పుల్ల విరుపు మాట‌లు మాట్టాడుతోందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది నెటిజ‌న్ల నుంచి. తాజాగా బాబు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌ను సోష‌ల్ మీడియాలైన ఫేస్ బుక్‌లు, వాట్స‌ప్‌, ట్విట్ల‌ర్ల‌లో నెటిజ‌న్లు ఎద్దేవా చేస్తున్నా రు. తాను ప‌ట్టిన కుందేలుకు మూడేకాళ్ల‌నే సీఎం దేశం మొత్తంలో ఈయ‌నేన‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఏపీ అభివృద్ధి, ప్ర‌త్యేక హోదా అంటూనే బాబు.. రాజ‌కీయాలు చేస్తున్నార‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. 

Image result for ap special status

ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం రాష్ట్రంలో విప‌క్ష‌లు అన్నీ క‌ల‌సిఉద్య‌మాలు చేస్తున్నాయి. అయితే, వీటికి సంఘీభావం ప్ర‌క‌టించాల్సిన సీఎం.. పోలీసుల‌తో వాటిని క‌ట్ట‌డి చేస్తారు. అయితే, త‌న‌కు మూడ్ వ‌చ్చిన‌ప్పుడు మాత్రం అన్నిప‌క్షాల‌నూ క‌లుపుకొని వెళ్తాన‌ని ప్ర‌క‌టించ‌డంపై నెటిజ‌న్లు స‌టైరిక ల్‌గా కామెంట్లు చేస్తున్నారు.గ‌తంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా అడిగిన వాడు ద్రోహి అంటూ ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు.. అదే హోదా కోసం ఇప్పుడు ఢిల్లీ పెద్ద‌ల‌తో పోరు చేస్తున్నారు. ఇంత‌క‌న్నా యూట‌ర్న్ రాజ‌కీయాల్లో ఏం ఉంటుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు సోష‌ల్ మీడియాలో. 

Image result for ysrcp

అదేవిధంగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆఫీస్ అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డంపైనా టీడీపీ నేత‌లు చిందులు తొక్కారు. దీనిని కూడా సోష‌ల్‌మీడియా గ‌తంలోనే త‌ప్పు ప‌ట్టింది. మోడీ ఏ నిర్ణ‌యంతీసుకోవాల‌న్నా.. టీడీపీ నేత‌ల‌ను అడిగే తీసుకోవాలా?  అని ఎద్దేవా చేసింది. ఇలా చంద్ర‌బాబు అండ్ టీం వేస్తున్న ప్ర‌తిఅడుగుల‌ను సోష‌ల్‌మీడియాలో ప్ర‌జ‌లు జోరుగా షేర్‌చేస్తున్నారు. తాజాగా చంద్ర‌బాబు దీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. చంద్ర‌బాబు సెంటిమెంట్‌ను మ‌రింత ర‌గిల్చేందుకు ఏకంగా త‌న పుట్టిన రోజు ఏప్రిల్ 20నే సెంట‌ర్ చేసుకుని.. ఆ రోజే ధ‌ర్మ‌పోరాట దీక్ష పేరుతో కేంద్రంపై పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. 

Image result for vijay sai reddy

అంతేకాదు, ఈ దీక్ష‌ను వ్య‌క్తిగ‌త హోదాలో కాక‌పోవ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యక‌ర విష‌యం. ఈ దీక్ష ను చంద్ర‌బాబు తాను సీఎం హోదాలో నే నిర్వ‌హిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. దీనిపైనే సోంత పార్టీ నేత‌లు సైతం విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ప్రధాని న‌రేంద్ర మోడీ ఇటీవ ల విప‌క్షాల వ్య‌వ‌హార శైలిపై ఒక‌రోజు దీక్ష‌చేసిన‌ప్పుడు చంద్ర‌బాబు తీవ్రంగా విమ‌ర్శించారు. అయితే, ఇప్పుడు అదే దీక్ష‌ను తాను ధ‌ర్మ‌పోరాటం అనే పేరు త‌గిలించి చేస్తున్నారు. దీనిని బ‌ట్టి.. చంద్ర‌బాబు వ్యూహం ఏంటి?  రాజ‌కీయంగా ఆయ‌న ఫెయిల్ అయ్యారు. కాబ‌ట్టి.. దానిని కప్పిపుచ్చుకునేందుకు బాబు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఎంతైనా బాబు బాబేన‌ని అంటున్నారు. మ‌రి దీనికి టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: