నోట్ల రద్దు.. 2016 వ సంవత్సరం నవంబర్ 8 న దేశంలో చలామణిలో ఉన్న అన్ని 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. నల్లకుబేరుల భరతం పట్టడానికి ఈ నోట్ల రద్దు కార్యక్రమానికి పూనుకున్నామని బీజేపీ గొప్పలు చెప్పుకున్నా ఆ నిర్ణయంతో బాగా ఇబ్బందిపడింది మాత్రం సామాన్య మానవుడే. అసలు ఒక ఏటిఎం దగ్గర అయినా నిలబడకుండా ఒక కుబేరుడు డబ్బులు ఎలా మార్చగలిగాడు అన్న ప్రశ్న సామాన్యుడికి ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది.


తమిళనాడుకు చెందిన శేఖర్‌ రెడ్డి ఇళ్లపై దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు  70కోట్లు విలువచేసే కొత్త 2వేలు ఉండడం అందరినీ విస్మయానికి గురిచేసింది. తాజాగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, శేఖర్‌ రెడ్డి మరియు చంద్రబాబు మధ్య సంబంధం గురించి కీలక విషయాలను తెలియజేసాడు.


ఒక టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ డిమోనిటైజెషన్  సందర్భంగా చంద్రబాబు, శేఖర్ రెడ్డి ద్వారా 500 కోట్ల రూపాయల బ్లాక్ మనీని మార్చుకున్నారని, ఈ విషయం శేఖర్ రెడ్డి స్వయంగా సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో  పేర్కొన్నట్లు తెలిపాడు. సీబీఐ నివేదిక బయటపడితే బాబు బండారం బయటపడుతుందని చెప్పాడు. బాబు చీకటి కోణాలను ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్తానని ఆయన తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: