తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకు ఆంధ్రరాష్ట్రంలో దిగజారిపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా డిపాజిట్లు కూడా దక్కవు అన్నట్టుగా ఉంది. కారణం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయమై చేసిన రాజకీయాలు ప్రజలకు అర్ధమైపోయయి...దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రజలలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వీటిని కూడా నెరవేర్చకుండా చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీని గద్దె దించడానికి రెడీగా ఉన్నారు.

Related image
ఇదే విషయం ప్రజా సంకల్ప పాదయాత్ర లో కనబడుతుంది. ప్రతిపక్ష నేత జగన్ కి ప్రజలందరూ చంద్రబాబు ఏ విధంగా మోసం చేసాడో చెప్పుకుంటున్నారు. పార్టీ పరిస్థితి ఇలా ఉన్న నేపథ్యంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ పరువును నడిరోడ్డు మీద తీసేశారు. తొలి నుంచి దూకుడు స్వభావం ఉన్న ప్రభాకర్ మరోసారి తన ప్రతాపం చూపించారు. ఇప్పటికే ఒక కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడి, బెయిల్‌పై బయట తిరుగుతున్న చింతమనేని ఈసారి ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ మీద రెచ్చిపోయారు.
Related image

హనుమాన్‌ జంక్షన్‌లో వీరంగమాడిన చింతమనేని ఆర్టీసీ సిబ్బందిని బండ బూతులు తిడుతూ కొట్టినంత పనిచేశాడు. అయితే ఇదేమిటని ఓ స్థానికుడు ప్రశ్నించడంతో రెచ్చిపోయిన చింతమనేని అతనిపై చేయి చేసుకున్నాడు. చింతమనేని వీరంగంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. చింతమనేని దాడి విషయం తెలుసుకున్న స్థానికులు హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
Image result for chintamaneni prabhakar hanuman junction
ఇంతకీ చింతమనేని ఎందుకు చేసుకున్నాడంటే  బస్సుపై అతికించిన ప్రభుత్వ పోస్టర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో చిరిగి ఉండటంతో గమనించి తన అనుచరులతో బస్సును అడ్డగించారు. డ్రైవర్‌‌ను, కండక్టర్‌ను కిందికి దించి నడిరోడ్డుపైనే బండ బూతులు తిట్టాడు. ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ పై హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ మొత్తం గొడవ చూసిన అక్కడ ప్రజలు తెలుగుదేశం పార్టీకి రోజులు దగ్గరపడ్డాయి అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: