చంద్ర బాబు సందు దొరికితే చాలు తన వల్లించే మాటలు కోటలు దాటి పోతాయి. తాను మాట్లాడింది ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా లేదా అన్నది పట్టించుకోడు. తన గురించి లేని పోటీని డబ్బా కొట్టుకుంటాడు. తనను ప్రధాన మంత్రి ని చేయడానికి అప్పుడు చాలా మంది ప్రయత్నించారని కానీ దానికి ఒప్పుకోలేదని పాత గుర్తులను నెమరు వేసుకుంటున్నాడు. అయితే తాను ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినపుడు బాబుకు అంత ప్రాధాన్యత ఎవరు ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే. 

Image result for chandrababu naidu

ఒకవైపు చంద్రబాబునాయుడు కూడా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత.. కేంద్రంలో అధికారంలోకి రావాల్సింది ఎవరో డిపైడ్ చేసేది మనమే అని బీరాలు పలుకుతున్నప్పటికీ.. వాతావరణం అంత ఏకపక్షంగా లేదు. మరోవైపు కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా- ప్రత్యామ్నాయంగా మూడో కూటమికి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. దేశంలోని కొన్ని శక్తులు ఆయన ప్రతిపాదనకు ఓకె చెప్పి ఆ మూడో గూటికి చేరుతున్నాయి.

Image result for chandrababu naidu

తాజాగా బిజూపట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్.. చంద్రబాబు కేంద్రంపై వేస్తున్న రంకెలను పట్టించుకోకుండా.. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న కూటమిలో చేరడానికి ఆసక్తి చూపిస్తుండడం చిత్రమే. మూడో కూటమి గురించి చర్చించడానికి కేసీఆర్ ను , నవీన్ పట్నాయక్ భువనేశ్వర్ కు ఆహ్వనించడం చూస్తే.. బిజూ తనను నెత్తిన పెట్టుకున్నట్టు చంద్రబాబు చెప్పుకున్న మాటలు డొల్లవేనా? అనే అనుమానం కూడా కలుగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: