టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై వస్తున్న వివాదం చిలికి చిలికి గాలి వాన అవుతుంది.  నటి శ్రీరెడ్డి కి మద్దతుగా మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు వస్తున్న నేపథ్యంలో మొన్న శ్రీరెడ్డి  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఈ వివాదం రాజకీయం రంగు పులుముకుంది.  ఆ మాట అన్నందుకు శ్రీరెడ్డిపై పవన్ ఫ్యాన్స్ భయంకరంగా విరుచుకు పడుతున్నారు. అయితే శ్రీరెడ్డికి మద్దతుగా సామాజిక కార్యకర్త సంధ్య ముందుంటుంది. ఆమెపై సినీనటి, ప్రొడ్యూసర్‌ జీవిత నిన్న మండిపడ్డ విషయం తెలిసిందే. సంధ్యను వదిలిపెట్టనని, నిరాధార ఆరోపణలు చేసిందని జీవిత అన్నారు.
Jeevitha Rajasekhar - Sandhya POW - Sri Reddy
ఈ విషయంపై సంధ్య ప్రముఖ తెలుగు న్యూస్‌ ఛానెల్‌ టీవీ9కి తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చి ఆధారాలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. రాజశేఖర్‌ను పల్లెటూరు నుంచి వచ్చిన ఓ అమ్మాయి కలిసిన తీరుపై ఆమె స్పష్టంగా వివరించి చెప్పారు. ఇదిలా ఉంటే..సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ని యువ నటి శ్రీరెడ్డి ఓ పదాన్ని వాడుతూ దూషించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆమెకు సినీ ప్రముఖుల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ మరికొందరి నుంచి మాత్రం మద్దతు వస్తోంది. 
Image result for rajashekar hero
ఆ మద్య విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్‌ రెడ్డి' సినిమాలోనూ ఇదే అసభ్య పదాన్ని ఉపయోగించిన విషయం తెలిసిందే. సామాజిక కార్యకర్త సంధ్య ఈ విషయంలో శ్రీరెడ్డికి మద్దతు తెలుపుతూ ఆ విషయాన్ని లేవనెత్తారు.  'అర్జున్‌ రెడ్డి' హీరో విజయ్‌ దేవరకొండ ఆ మాట అంటే ఆయన హీరో అయిపోతారు.. టీవీలో నేను చూశాను.. ఓ కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులందరితో ఆ పదం అనిపించారు.
Related image
మన సినీ ఇండస్ట్రీకి ఆ పదం అప్పుడు ఎంత కమ్మగా వినిపడిందో నాకు తెలియదు. విజయ్‌ దేవరకొండ అంతమందితో అనిపించినప్పటికీ సిగ్గుపడని ఇండస్ట్రీ ఇప్పుడు ఒక ఆడపిల్ల ఆ పదం వాడితే ఇలా చేస్తోంది. ఇండస్ట్రీ పెద్దలు అప్పుడు ఎందుకు చెప్పలేదు? అనసూయ అనే అమ్మాయి తప్ప ఆ విషయంపై ఎవ్వరూ ఖండించలేదు. యువతలో ఇటువంటివన్నీ సినిమా వాళ్లే చొప్పిస్తున్నారు" అంటూ మండిపడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: