ఆయన జాయింట్ కలెక్టర్.. అంటే జిల్లాకు కలెక్టర్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న వ్యక్తి. కానీ ప్రజాసేవ సంగతి మరచి లంచాలకు మరిగాడు.. చివరకు ఏసీబీ చేతికి చిక్కి ఇప్పడు పరువు పోగొట్టుకుని తలపట్టుకుంటున్నాడు. ఆయనే విజయనగరం జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ నాగేశ్వరరావు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఈయన తన ఆస్తులు ఏ రేంజ్ లో పెంచుకున్నారంటే ఏకంగా ఉమ్మడి ఏపీలోని 11 చోట్ల అధికారులు దాడులు నిర్వహించాల్సి వచ్చింది. ఈయన అక్రమాస్తులు లెక్కేస్తే దాదాపు 60 కోట్ల రూపాయల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈయన ఉద్యోగ జీవితాన్ని పరిశీలిస్తే.. 1990లో డిప్యూటీ తహసిల్దార్‌గా రెవెన్యూ శాఖలో చేరాడు.


ఆ తర్వాత ఉభయగోదావరి జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఏలూరులో ఆర్డీవో విధులు నిర్వహించారు. అంతేకాదు.. అన్నవరం ,  కోరుకొండ లక్ష్మీ  నరసింహ స్వామి దేవస్థానాల్లో ఈవోగా పని చేశాడు. ఎక్కడ పనిచేస్తే అక్కడ లంచాలు బాగా గుంజుతాడని పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే ఆయన పాలిట శాపంగా మారింది. ఇటీవల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో లంచాలు తీసుకున్నట్టు ఫిర్యాదులొచ్చాయి.


చివరకు ఆ ఫిర్యాదులే ఆయన్ను పట్టించాయి. ఈ కంప్లయింట్ల ఆధారంగా కాకర్ల నాగేశ్వరరావు ఆస్తులుపై దృష్టిసారించిన అవినీతి నిరోధక శాఖ ఒకేసారి 11 ప్రాంతాల్లో రాత్రి వరకూ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. విశాఖ జిల్లా పెదవాల్తేర్, విజయనగరంలోని నివాసంలో అక్రమాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 7ఇంటి స్థలాలు, 3 ఫ్లాట్లు , నిర్మాణంలో ఉన్న 2 గృహాలు, 12 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలనుస్వాధీనం చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: