పవన్ కల్యాణ్ నిర్ణయాలు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటాయి. ఆయన నిర్ణయాలకో లెక్క ఉంటుందని కొందరు భావిస్తే.. వాటి వెనుక తిక్క కూడా ఉంటుందని మరికొందరు భావిస్తుంటారు. తాజాగా గన్ మెన్ లను తిప్పిపంపుతూ పవన్ తీసుకున్న నిర్ణయంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

Image result for pawan gunmen

పవన్ కళ్యాణ్ కు నెల రోజుల క్రితం ప్రభుత్వం గన్ మెన్ లను కేటాయించింది. తనకు భద్రత కల్పించాలంటూ స్వయంగా డీజీపీని కలిసి విజ్ఞప్తి చేయడంతో గన్ మెన్ లను ఇచ్చింది. ఇందుకు ఆయన కృతజ్ఞత కూడా తెలిపారు. నెలరోజులు తిరగకుండానే ఆ గన్ మెన్ లను తిప్పి పంపించేశారు పవన్. జనసేన పార్టీ అంతర్గత వ్యవహారాలను, రహస్యాలను ఆ గన్ మెన్ లు చేరవేస్తున్నారనేది జనసేన చేస్తున్న ఆరోపణ. అందుకే వారిని వెనక్కు పంపించినట్టు పార్టీ ప్రకటించింది.

Image result for pawan gunmen

పవన్ కల్యాణ్ ప్రతి కదలిక పైనా ప్రభుత్వం నిఘా పెట్టిందని, గన్ మెన్ ల ద్వారా సమాచారాన్ని సేకరిస్తోందని జనసనే భావిస్తోంది. తమ అంతర్గత వ్యవహారాలు లీక్ కావడం వల్ల తమ వ్యూహాలకు విఘాతం కలుగుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇది పార్టీని దెబ్బతీస్తుందని అనుమానిస్తోంది. సెక్యూరిటీ పేరుతో ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని జనసేనని అనుమానిస్తున్నారు. ఇటీవల తనపై జరుగుతున్న దుష్ప్రచారం, ఆరోపణలను నిశితంగా గమనిస్తున్న జనసేనాని.. వీటి వెనుక సమాచారం లీక్ అవుతోందని, ఇందుకు సెక్యూరిటీయే కారణమని భావించారు.

Image result for pawan gunmen

ఇటీవలికాలంలో పవన్ కల్యాణ్ టీడీపీ బీజేపీలకు వ్యతిరేకంగా మాటలతూటాలు పేల్చుతున్నారు. ముఖ్యంగా టీడీపీని టార్గెట్ చేసుకుని పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. బీజేపీ, టీడీపీలతో సన్నిహితంగా ఉన్నన్ని రోజులూ పవన్ కల్యామ్ నడక సక్రమంగానే సాగింది. కానీ ఇప్పుడు పవన్ ను ఆ పార్టీలు నమ్మడం లేదు. ఆయన్ను టార్గెట్ గా చేసుకుని పలువురు విమర్శలు సంధిస్తున్నారు. ముఖ్యంగా శ్రీరెడ్డి, కత్తి మహేశ్ లతో పాటు తాజాగా వైసీపీ నేతలు తనను టార్గెట్ గా చేసుకున్నారని పవన్ భావిస్తున్నారు. పవన్ సోదరుడు నాగబాబు కూడా పవన్ పై కుట్ర జరుగుతోందని అనుమానించారు.

Image result for pawan gunmen

అయితే విమర్శలు వస్తున్నాయనే కారణంతో పవన్ గన్ మెన్ లను తిప్పిపంపడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకుడికి సెక్యూరిటీ కల్పించడం కొత్తేమీ కాదు. పైగా తనకు తాను అడిగి మరీ గన్ మెన్ లను తెప్పించుకున్నారు పవన్. అయితే ఏవో రహస్యాలు బయటకు వెళ్తున్నాయనే కారణంతో గన్ మెన్ లను తిప్పిపంపారు. అయితే రాజకీయ నాయకులందరికీ గన్ మెన్ లు ఉంటారు. తన చేతకాని తనాన్ని గన్ మెన్ లపైకి నెట్టేసి పవన్ తప్పించుకోజూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: