ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినహామీల అమలులో జరుగుతున్న నిర్లక్షయాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ధర్మ పోరాట’ దీక్ష పేరుతో చేయబోతున్న ఒకరోజు దీక్షకు కౌంట్ డౌన్ మొదలైయింది. విజయవాడ  ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధరంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో కలిసి చేయబోతున్న దీక్షకు అత్యంత భారీ ఏర్పాట్లు చేయడమే కాకుండా ఈదీక్షలో చంద్రబాబుతో కలిసి 10వేల మంది కూర్చోబోతున్నారని తెలుస్తోంది. 
CHANDRABABU DHARMA PORATA DEEKHA PHOTOS కోసం చిత్ర ఫలితం
రేపు విజయవాడలో ఎండవేడి 42 డిగ్రీలు ఉండబోతోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో విజయవాడ రాజకీయవాతావరణం సూర్యుడు వేడినిమించి మండిపోతోంది. ధర్మపోరాట దీక్ష అంటూ పుట్టినరోజునాడు తాను చేసే ఉపవాస దీక్షతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మార్కులు కొట్టే ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు వ్యూహానికి షాక్ ఇచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ రచిస్తున్న వ్యూహాలు తెలుగుదేశ  వర్గాలను కలవర పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లోటస్ పాండ్ వర్గాలనుండి అందుతున్న లీకులు ప్రకారం ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృష్ణాజిల్లాలో యాత్ర చేస్తున్న జగన్ తన పార్టీ కీలకనేతలు ఎంపీలతో అత్యవసరంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. 
JAGAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈసందర్భంగా జగన్ తన పార్టీ ముఖ్యనేతలతో చేసినట్లుగా వస్తున్న కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు  రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. తమ పార్టీ ఎంపీల రాజీనామాలతో అనుకున్నంత హైప్ రాలేదు గనుక ప్రత్యేక హోదా ఉద్యమంలో పై చేయి సాధించడానికి తెలుగుదేశం పార్టీని అంతకంటే గట్టిగా మరో దెబ్బ కొట్టాలన్నది జగన్ కొత్త వ్యూహం అని  తెలుస్తోంది. ఈసారి పార్టీ ఎమ్మెల్యేలందరితో మూకుమ్మడి రాజీనామాలు చేయించి హోదా నినాదంతో జనంలోకి వెళితే క్రెడిబిలిటీ పెరిగి జనం తన మాటలు పూర్తిగా విశ్వసించే అవకాశం ఉందని జగన్ అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. 
సంబంధిత చిత్రం
దీనితో ఈనెల 22న జరిగబోయే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మరో కీలక సమావేశంలో ఎమ్మెల్యేల అందరితో రాజీనామా అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే ఏపీలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాసం ఉంది. ఇప్పట్టికే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ చంద్రబాబుల రాజకీయ చదరంగంలో చాలా ఎత్తుకు పై ఎత్తులు నడుస్తున్న నేపధ్యంలో రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉంది అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: