తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై మాట్లడుతూ..మొన్నటి వరకు సెన్సేషన్ క్రియేట్ చూసింది నటి శ్రీరెడ్డి.  అయితే ఆ మద్య అర్థనగ్న ప్రదర్శన తర్వాత అనూహ్యంగా శ్రీరెడ్డి పోరాటానికి బలం చేకూరింది.  మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, జూనియర్ ఆర్టిస్టులు ఆమెకు సపోర్ట్ గా రావడంతో శ్రీరెడ్డి ఓ అడుగు ముందుకు వేసి..జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దాంతో ఒక్కసారే ఈ ఎపిసోడ్ లో ప్రకంపణలు పుట్టుకొచ్చాయి..పవర్ స్టార్ ఫ్యాన్స్ శ్రీరెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
Image result for sri reddy hospital
ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీరెడ్డి ని పవన్ కళ్యాన్ ని అలా మాట్లాడాలని చెప్పినట్లు దర్శకులు రాంగోపాల్ వర్మ అనడం..శ్రీరెడ్డి తనపై వైసీపీ కుట్ర పన్నిందని ఫోన్ కాల్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై  వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీరెడ్డి వెనుకో..మరో రెడ్డి వెనుకో ఉండాల్సిన అవసరం వైసీపీకి లేదని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image result for ysrcp
పోరాటాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని, ఏదైనా మాట్లాడదలచుకుంటే సూటిగా, ఘాటుగా మేమే మాట్లాడతాము తప్ప, ఎవరి వెనుక ఉండాల్సిన అవసరం తమకు లేదని అన్నారు.  శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం వేరని..ఇందులో రాజకీయాలు ఎందుకు తీసుకు వస్తారని ఆయన అన్నారు. ఎవరు ఏం చేసినా దాని వెనుక వైసీపీ ఉందంటూ కొందరు కుట్ర చేస్తున్నారని అంబటి విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: