ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జన్మదినం అయినా ఈ రోజు.. తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని దీక్షకు కూర్చునోనున్నారు. మోడీ ప్రధాని అయ్యాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా యిస్తానని చెప్పి మోసం చేయడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దీక్షకు ‘ధర్మ పోరాట దీక్ష’ అని పేరు పెట్టారు. దీక్షా ప్రాంగణంలో ఎల్ఈడీ స్క్రీన్లు అమర్చి ప్రజలకు సౌకర్యాలు అద్భుతంగా చేసారు.
Related image
అంతేకాదు ఈ సభ అయిన వెంటనే అదే ప్రాంగణంలో  టీడీపీ-దళితతేజం విజయోత్సవ సభను నిర్వహిస్తారు. అదే వేదిక నుంచి చంద్రబాబు ప్రత్యేక హోదా సాధనకు ప్రభుత్వం అనుసరించబోయే కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తారు. మోడీ సర్కారును తాము ఎలా ఢీకొట్ట బోతున్నది ప్రకటించబోతున్నారు. ఒక మహా సంగ్రామానికి అంకురార్పణ చేయబోతున్నారు.
Image result for chandrababu
చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి రాష్ట్ర ప్రజల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. విభజన జరిగిన నేపథ్యంలో అప్పట్లో కేంద్రం ఇచ్చిన ప్రతి హామీలు నెరవేర్చాలని చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నారు. అంతేకాకుండా మోడీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఏవిధంగా మోసం చేశారు కూడా ఓ చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో రాష్ట్ర ప్రజలకు తెలపాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశించారు చంద్రబాబు.
Image result for chandrababu
అయితే చంద్రబాబు చేస్తున్న దీక్షకు రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు కంగారుపడుతున్నారు...మరోపక్క విపక్షాలు మాత్రం ఇది 420 దీక్ష అని అంటున్నారు...ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చంద్రబాబుపై నమ్మకత్వం పోయింది అని సెటైర్లు వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: