ఏపీ సీఎం చంద్ర‌బాబు అధికారిక హోదాలోనే దీక్ష‌కు దిగుతున్న విష‌యం జాతీయ స్థాయిలో అంద‌రికీ తెలిసిందే. ఏపీకి ప్ర‌త్యేక హోదా, నిధులు, విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వంటి వాటి కోసం ఆయ‌న ధ‌ర్మ పోరాట దీక్ష పేరుతో ఆయ‌న త‌న పుట్టిన రోజు ఏప్రిల్‌-20న రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే దీక్ష‌కు దిగుతున్నారు. దీనికి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను, అధికారుల ను, రాజ‌కీయ ప‌క్షాల‌ను, జాతీయ స్థాయి నేత‌ల‌ను, వివిధ స్వచ్ఛంద సంస్థ‌ల అధిప‌తుల‌ను కూడా ఆయ‌న ఆహ్వానించా రు. దీంతో ఈ దీక్ష‌కు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ల‌భించింది. జాతీయ మీడియాను సైతం బాబు ఆహ్వానించ‌డం ద్వారా త‌న పోరాటాన్ని జాతీయ స్థాయిలో ప్ర‌సార‌మ‌య్యేలా వ్యూహం సిద్ధం చేసుకున్నారు. అయితే బాబు దీక్ష‌పై విమ‌ర్శ‌లు వెల్లువె త్తుతున్నాయి. కొంద‌రు టీడీపీలోనే అసంతృప్తి నేత‌లు ఆఫ్ దిరికార్డుగా మీడియా ప్ర‌తినిధుల‌కు ఫోన్లు చేసి బాబును విమ‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

Image result for chandrababu deeksha

``శుక్ర‌వారం మా ఇంట్లో శుభ‌కార్యం పెట్టుకున్నాం. అది మాకు చాలా ముఖ్యం., కానీ, అదేరోజు చంద్ర‌బాబు దీక్ష‌కు దిగుతున్నారు. అటు వెళ్లాల్సిందేన‌ని మినిస్ట‌ర్ నుంచి ఫోన్ వ‌చ్చింది. అటు ఆ కార్య‌క్ర‌మానికి వెళ్తే.. ఉదయం నుంచి సాయం త్రం వ‌ర‌కు అక్క‌డే ఉండి పోవాలి. ఇక‌, ఇంటికి ఎప్పుడు వ‌చ్చేది., మా ఇంట్లో శుభ‌కార్యం ఉంద‌ని ముందుగానే చెప్పా.. అయినా  న‌న్ను ఇబ్బంది పాలు చేస్తున్నా``రంటూ.. విజ‌య‌వాడ‌కు చెందిన ఓ సీనియ‌ర్ టీడీపీ నేత మీడియా ప్ర‌తినిధికి చెప్పి వాపోయారు. అంతేకాదు, ఇన్నాళ్లూ రాని ప్ర‌త్యేక హోదా.. ఇప్పుడు వ‌చ్చేస్తుందా? అని ఆయ‌న చివ‌ర‌లో స‌ణ‌గ‌డం ఆయ‌న‌లోని అస‌హ‌నాన్ని రుజువు చేసింది. ఇదే తీరులో కొంద‌రు నేత‌లు పేర్కొన‌డం కూడా గ‌మ‌నార్హం. ఇక‌, వైసీపీ నుంచి విమ‌ర్శ‌లు మామూలే. ఈ పార్టీ సీనియ‌ర్ నేత‌, తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాదు తీవ్ర‌స్థాయిలో బాబుపై మండిప‌డ్డారు. 

Image result for chandrababu deeksha

మరోసారి ప్రజలను మోసం చేసేందుకే బాబు దీక్ష చేపడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి.. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను కాలరాసి.. చంద్రబాబు చేస్తున్న దీక్ష కొంగజపం లాంటిదని  వరప్రసాద్‌ విమర్శించారు. నాలుగేళ్లుగా కేంద్రంతో సక్యతగా ఉంటూ.. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్నానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు.
Image result for ysrcp
పీఎం నరేంద్ర మోడీ గ్రాఫ్‌ పడిపోతోందని భావించిన చంద్రబాబు మళ్లీ కొత్త చక్రాలను వెతుక్కుంటూ.. బయటకు వచ్చి ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టేందుకు దీక్ష చేపడుతుందన్నారు. దీక్ష ప్రజాస్వామ్య ఆయుధమని, కానీ చంద్రబాబు లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకులు దీక్ష చేపడితే.. దాని అర్థం మారిపోతుందని దుయ్య‌బ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. మ‌రి మొత్తానికి బాబు దీక్ష ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: