జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాపైన, చంద్రబాబు అతని తనయుడు లోకేష్ పైన విరుచుకుపడ్డారు. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పై మీడియాలో వస్తున్న కథనాలు తీవ్ర సంచలనం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. దీని వెనుక కుట్ర జరుగుతోందనే అనుమాలను జనసేన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.

Image result for pawan kalyan

పవన్ కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని అల్లు అరవింద్ చెప్పి 24 గంటలు కూడా గడవక ముందే పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. తనపై మీడియాలో ఓ వర్గం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇందుకు సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ హస్తముందన్నారు. స్పెషల్ స్టేటస్ కంటే చట్టబద్ధ వ్యభిచారమే మీడియాకు ముఖ్యమని విమర్శించారు. వీటిలో మీకు ఏది ముఖ్యం.. అని సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. టీవీ5 యాంకర్ సాంబశివరావును మీ కుమారుడు లోకేష్ “అంకుల్” అని ముద్దుగా పిలుస్తుంటారని గుర్తు చేశారు. ఒకప్పుడు దొరలంటే భూస్వాములని, ఇప్పుడు మీడియా ఆసాములే దొరలన్నారు. వారు చెప్పిందే వేదం, పాడిందే నాదమన్నారు.


తనకు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న తిట్లదండంకపై కూడా పవన్ విరుచుకుపడ్డారు. అలాంటి తిట్లను చంద్రబాబుపైన కానీ, లోకేష్ పైన కానీ, బాలకృష్ణపైన కానీ చేసే సాహసం మీకుందా అని మీడియాను ప్రశ్నించారు. దర్శకుడు వర్మ, శ్రీసిటీ, టీవీ9 ఓనర్ శ్రీనిరాజు, టీవీ9 రవి ప్రకాష్ ద్వారా లోకేష్ అతని ఫ్రెండ్ కిలారు రాజేష్ చేస్తున్న విషయాలు మీకు తెలియవా అని చంద్రబాబును ప్రశ్నించారు. మీ ప్రభుత్వం రావడానికి కృషి చేసినందుకు మీరు నాకు ఇచ్చిన బహుమతి సెక్రటేరియేట్ వేదికగా తిట్టించడమేనన్నారు. మీ మీడియా సంస్థలైన టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఇతర కొన్ని చానళ్లు, సోషల్ మీడియా ద్వారా నా పైన, నా కుటుంబం మీద, నన్ను అభిమానించేవారి మీద నిరవధిక అత్యాచారం జరిపారని, జరిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ నన్ను, నాకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డులో అసభ్య పదజాలంతో పచ్చి బూతులు తిట్టించారన్నారు. ఆ తిట్లను పదేపదే తిట్టించి, డిబేట్లు పెట్టి వాటిని మీ పార్టీ వ్యక్తులు సర్య్కులేషన్ లో పెట్టారని విమర్శించారు. ధర్మ పోరాట దీక్షలో పాల్గొనాలంటూ మీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పంపిన ఆహ్వానం అందిందన్న పవన్.. అందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి మేలు జరిగేందుకు కలసి రావాలని అందులో పేర్కొన్నారని.. అయితే ఏమీ ఆశించకుండా మీరు అధికారంలోకి రావడానికి కృషి చేశాన్నారు. అయితే మీరు, మా కుమారుడు, అతని స్నేహితులు చేయూత నిచ్చిన చేయిని వెనుక నుంచి మీడియా ద్వారా చంపేస్తుంటారని .. అలాంటి మిమ్మల్ని ఎలా నమ్మాలని పవన్ ప్రశ్నించారు.


తాను నటుడిని కాకముందు నుంచే, రాజకీయ పార్టీ పెట్టక ముందు నుంచే తానొక తల్లికి బిడ్డనని పవన్ చెప్పుకొచ్చారు. అలాంటి తల్లి గౌరవాన్ని కాపాడలేని కొడుకు బతికున్నా చచ్చినట్టేనన్నారు. సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులకు, అక్కచెల్లెళ్లకు, కూతుళ్లకు, కోడళ్లకు, ఇంటిల్లిపాదికీ వందనాలు తెలిపారు. ఈ రోజు నుంచి తాను ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ చెప్పారు. ఒకవేళ ఈ పోరాటంలో తాను చనిపోతే.. “ నేను ఎంతో కొంత నిస్సహాయులకు అండగా, అధికారం అనేది అందడందలు ఉన్నవారికే పనిచేసే ఈ దోపిడీ వ్యవస్ధపై ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన విధానాలకు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలని” ముగించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: