విభజన సమయంలో ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినా అది ఇప్పటి వరకు నెరవేర్చలేదు. గత నెల కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ఇప్పటి వరకు ఎన్నో ప్యాకేజ్ లు ఇచ్చామని..ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.  అప్పటి వరకు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజలు గుండె రగిలిపోయింది..చిన్నా..పెద్దా..పల్లె పట్నం అందరూ రోడ్డు పైకి వచ్చారు.  వీరికి తోడు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు సైతం ప్రత్యేక సాధన లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు.  అయితే సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి బీజేపీతో మిత్ర పక్షంగా ఉంటూ వచ్చిన టీడీపీ కేంద్ర నిర్ణయంతో ఆగ్రహానికి లోనైంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ తో విభేదించి ప్రత్యేక హోదా కోసం ప్రత్యక్షంగా పోరాటాని సిద్దమయ్యారు.  నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ధర్మ పోరాట దీక్ష’ను చేపట్టారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష 12 గంటలపాటు రాత్రి 7 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. 

దీక్షా స్థలికి చేరుకున్న సీఎం ముందుగా మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌, జ్యోతిరావు పూలే, ఎన్టీఆర్‌ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి, రాష్ట్ర గీతం‘మా తెలుగు తల్లికి మల్లెపూ దండ’ను ఆలపించారు. సర్వమత ప్రార్థనల అనంతరం చంద్రబాబు దీక్షను ప్రారంభించారు.   వేదికపైకి రాగానే తిరుమల, దుర్గగుడికి చెందిన వేదపండితులు, క్రైస్తవ, ముస్లిం, బౌద్ధ మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు జరిపి, ఆశీర్వచనాలు అందజేశారు. లాగే పలువురు స్వాతంత్య్ర సమరయోధులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు.
ap cm chandrababu starts dharma porata deeksha at vijayawada
మాజీ సైనికులు సైతం ముఖ్యమంత్రిని కలసి దీక్షకు సంఘీభావం తెలిపారు.ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న పోరాటంలో భాగంగా చంద్రబాబు ఈ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు తన పుట్టినరోజునే ఎంపిక చేసుకున్న బాబు, వేడుకలకు దూరంగా ఉండి, అందరూ కేంద్రంపై ధర్మాగ్రహం ప్రకటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రత చరిత్రలో సీఎం హోదాలో ఓ రాజకీయ నేత రాష్ట్రం కోసం తన పుట్టిన రోజున నిరాహారదీక్ష చేయడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి చేస్తున్న దీక్షకు వివిధ పార్టీలు, స్వచ్ఛంద, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. కేంద్రం ఇచ్చిన హామీ నెరవేర్చ వరకు ఈ పోరాటం ఆపేదే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: