తెలుగు ఇండస్ట్రీలో మొన్నటి వరకు కాస్టింగ్ కౌచ్ పై పెను వివాదాలు చెలరేగాయి. ఇప్పుడు ఇది వర్మ వర్సెస్ మెగా ఫ్యామిలీ వంతు అయ్యింది. 
తనపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ న్యాయపోరాటానికి దిగాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తన సోదరుడు నాగబాబుతో కలసి హైదరాబాదులోని ఫిల్మ్ ఛాంబర్ లో న్యాయవాదులతో ఆయన చర్చిస్తున్నారు. ఈ సంరద్భంగా పవన్ కల్యాణ్ తల్లి కూడా ఛాంబర్ కు వచ్చారు. తన తల్లికి న్యాయం చేసే వరకు తాను ఫిలిం ఛాంబర్‌ నుంచి వెళ్లేది లేదని చెప్పి, సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అక్కడే కూర్చున్న విషయం తెలిసిందే.

ఫిల్మ్ ఛాంబర్ కు వచ్చినవారిలో అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, వీవీ వినాయక్, పరుచూరి వెంకటేశ్వరరావు, శివాజీరాజా, హేమ, మారుతి, మెహర్ రమేష్, బన్నీ వాసు తదితరులు వచ్చారు. ఒక్కొక్కరుగా ఇతరులు కూడా వస్తున్నారు. కాసేపట్లో చిరంజీవి ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకోబోతున్నారు.  అయితే ఫిలిమ్ ఛాంబర్ కి వచ్చిన పవన్ కళ్యాన్ ని కలిసేందుకు సినీపెద్దలు రాలేదు.  అంతే కాదు అక్కడ మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు కిక్కిరిస పోవడం..ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో..పోలీసులు కూడా అదుపు చేయలనేని పరిస్థితి వచ్చింది.

దాంతో  ఇంతకు క్రితమే ఫిలిం ఛాంబర్‌లోంచి బయటకు వచ్చారు. పవన్ కల్యాణ్‌ ఆయన కారు వద్దకు వెళ్లే సమయంలో అభిమానులు పవన్‌ కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పవన్‌ కల్యాణ్‌ ని అభిమానులు చుట్టుముట్టడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కారు ఎక్కుతోన్న సమయంలో పవన్ కల్యాణ్‌ తన అభిమానులకు అభివాదం చేశారు. వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: