గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ పై శ్రీ రెడ్డి చేస్తున్న ఉద్యమం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొన్ని రోజులు ఉంటే ఆమె చేస్తున్న ఉద్యమానికి తగు ఫలితం వస్తుంది అని అనుకుంటుండగా అనవసరంగా, అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను రాయలేని భాషలో దూషించి మొదటికే మోసం తెచ్చుకుని తన ఉద్యమాన్ని తానే నేలపాలు చేసుకుంది.


ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న పవన్ ఆమె తన తల్లిపై చేసిన వాఖ్యలకు ఒక్కసారిగా నిన్న అర్థరాత్రి ట్విట్టర్లో ఘాటుగా స్పందించటం తీవ్ర చర్చనీయాంశమయింది. దీనివెనుక ఎవరెవరు ఉన్నారు, కుట్రలో ఎవరి పాత్ర ఎంత! అనే విషయాలను ట్విట్టర్ ద్వారా బయటపెట్టి సంచలనానికి దారి తీశాడు. అసలు శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంపై "మా" సరైన సమయంలో స్పందించి ఉంటే తనకు ఇప్పుడు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని ఈరోజు ఫిలిం ఛాంబర్ లో హల్ చల్ చేశాడు.


అసలు ఎల్లో మీడియానే వారి టీఆర్పీ రేటింగుల కోసం నా తల్లి గురించి శ్రీరెడ్డి మాట్లాడిన దుర్భాషను పదే పదే వారి ఛానెళ్లలో ప్రసారం చేసి నా తల్లిని తీవ్రంగా అవమానించారు అని ఆయన తెలపడం జరిగింది. దీనిని గుర్తుపెట్టుకున్న పవన్ అభిమానులు ఫిలిం ఛాంబర్ వద్ద ఆంధ్రజ్యోతి సంస్థ తమ వాహనాలను ఉంచగా వాటిని తీవ్రంగా ద్వంసం చేయడం జరిగింది. దీంతో అప్రమత్తమయిన పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకోవడంతో జరుగబోయే నష్టాన్ని కొద్దిమేరకు ఆపగలిగారు. కాగా ధ్వసం చేసి పారిపోతున్న వారిని పట్టుకొని ఠాణాకు తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: