జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో అమీతుమీ పోరాటానికే సిద్ధమైపోయినట్టున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు మీడియా జోలికి వెళ్లరు. ఎందుకొచ్చిన గొడవ అంటూ వారితో పెట్టుకునేందుకు వెనుకాడతారు. కాకపోతే.. చంద్రబాబు, జగన్ వంటి నేతలు తమను టార్గెట్ చేసే కొన్ని ఛానళ్లపై నేరుగానే విమర్శలు చేస్తుంటారు. వాటికి కౌంటర్ ఇచ్చేందుకు సొంత ఛానళ్ల అండ ఉండటం అందుకు కారణం.

Image result for pawan kalyan vs abn
కానీ పవన్ కల్యాణ్ కు సొంత మీడియా లేదు. మీడియా అండదండలు కూడా లేవు. అలాంటి స్థితిలో వేరొకరు ఉంటే కాస్త సంయమనం పాటిస్తారు.. కానీ పవన్ కల్యాణ్ మాత్రం మీడియాతో యుద్ధానికి సిద్ధమైనట్టు కనిపిస్తున్నారు. ఏకంగా మీడియా ఛానళ్ల పేర్లు ప్రస్తావిస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యేకించి టీవీ9, ఏబీఎన్ ఛానళ్లపై ఆయన కోపం నషాళాకి అంటుతోంది. 



ఏబీఎన్ ఛానల్ ఎండీ రాధాకృష్ణ ఫోటోను మరీ ట్వీట్టర్లో పెట్టి విమర్శలు గుప్పించారు పవన్ కల్యాణ్. ఈ విమర్శలు చూసి పవన్ అభిమానులు కూడా ఏబీఎన్ పై రెచ్చిపోయారు. ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్‌ వద్ద విధ్వంసం సృష్టించారు. ఏబీఎన్‌ ఛానల్ లైవ్ వ్యాన్‌, కారును ధ్వంసం చేశారు. మరికొన్ని వాహనాలపై పెద్ద పెద్ద బండ రాళ్లు రువ్వారు. ఈ దాడిలో జర్నలిస్టులకు స్వల్ప గాయాలయ్యాయని ఏబీఎన్ చెబుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: