సినిమాల్లో తమకు వేషాలు ఇప్పిస్తామని చెప్పి శారీరకంగా వాడుకుని, వారి కామదాహాన్ని తీర్చుకొని చివరకు సినిమాలో ఒక చిన్న పాత్రకూడా ఇవ్వకుండా మోసం చేసిన, చేస్తున్న దుర్మార్గుల భరతం పట్టడానికి ఒక పోరాటాన్ని కొనసాగిస్తున్నది శ్రీ రెడ్డి. ఇన్నాళ్లు ఒక క్రమ పద్దతిలో సాగిన ఆమె పోరాటం ఒక్కసారిగా పవన్ కల్యాణ్ ను దూషించడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది.


శ్రీరెడ్డి అలా వాఖ్యానించడానికి కారణం నేనేనంటూ రాంగోపాల్ వర్మ ముందుకురాగా, సినీప్రముఖులు సైతం వర్మ చేసిన పనికి అసహ్యించుకుంటున్నారు. వర్మ ఒక్కడే కాదు దీని వెనుక పలు మీడియా సంస్థల అధినేతలు మరియు మంత్రి లోకేశ్ ఉన్నారంటూ ట్వీట్లు చేసి కుట్రను బయటపెట్టాడు పవన్.


పవన్ ను అలా మాట్లాడినందుకు ఎంతమంది విమర్శిస్తున్నా శ్రీరెడ్డి మాత్రం తన వైఖరి మార్చుకోలేదు.తాజాగా తన ఫేస్ బుక్ పేజీలో జగన్ ను సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై మరోమారు తీవ్రంగా రాసుకొచ్చింది." నువ్వు ప్రజానాయకుడవైతే రాష్ట్రం అల్లర్లతో రణరంగం చేస్తావ్. ఫ్యాన్స్ ని మేనేజ్ చేయలేని నువ్వు రాష్ట్రాన్ని ఎలా మేనేజ్ చేస్తావ్. వాహనాలకు రక్షణ కల్పించలేని వ్యక్తిని ఎవరూ ఎన్నుకోరు. మా జగన్ అన్న ఓపిక, సహనం ముందు నువ్వు శూన్యం" అంటూ ఫేసుబుక్స్లో రాసుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: