టాలీవుడ్ లో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై చేస్తున్న ఉద్యమం తీవ్ర రూపం దాల్చే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళాన్ ని దారుణంగా దూశించడంతో విషయం కాస్త పక్కదారి పట్టింది. అప్పటి వరకు శ్రీరెడ్డికి సపోర్ట్ చేసిన వారు వ్యతిరేకులు అయ్యారు..ఇక పవన్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో శ్రీరెడ్డిని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతలోనే ఈ విషయంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంటర్ అయ్యారు..శ్రీరెడ్డిని ఆ మాటలు అనేలా తానే ప్రభావితం చేశానని చెప్పారు..అంతే కాదు పవన్ కళ్యాన్, ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పారు.  దీంతో ఇప్పుడు వర్మను టార్గెట్ చేశారు మెగా ఫ్యాన్స్..మెగా హీరోలు. 

ఈ నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాన్ ఫిలిం ఛాంబర్ వద్ద నానా హంగామా చేశారు. రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్.. మీడియా ప్రాధాన్యం ఏమిటో గుర్తించలేకపోయారా..? మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తాన్ని ఒకే సారి టార్గెట్ చేసుకుని ఏం సాధించబోతున్నారు..? బాయ్ కాట్ చేయాలంటూ ఇచ్చిన పిలుపు ఇచ్చారు. పవన్ కల్యాణ్ కు ఎలాంటి సమాచారం అందిందో కానీ… టీవీ నైన్, టీవీ ఫైవ్, ఏబీఎన్ లపై పూర్తి స్తాయిలో ఎటాక్ చేశారు. తర్వాత ఈ జాబితాలో మహా టీవీని కూడా చేర్చారు. దీంతో ప్రధాన టీవీ చానళ్లన్నింటితోనూ పవన్ వైరం పెట్టుకున్నట్లయింది. వీటిలో నేరుగా ఆరోపణలు గుప్పించిన రెండు చానళ్లు పవన్ పై పరువు నష్టం కేసులు వేసేందుకు సిద్ధమవుతున్నాయి.

రాజకీయ పార్టీ అధినేతగా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్న ఈ పరిస్థితి ఇబ్బందికరమే. నిజానికి శ్రీరెడ్డి ఇష్యూ నెల రోజుల్నించి నడుస్తోంది. టీఆర్పీల గేమ్ లో పండిపోయిన టీవీ నైన్..ఈ ఇష్యూని అలాగే తీసుకుంది. కానీ ఆర్జీవీ ఎంటరయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అర్జున్ రెడ్డి సినిమాతో పాపులరైపోయిన తిట్టు.. మొత్తం దశను మార్చింది. అది పవన్ కు మీడియాకు మధ్య సమరంగా మారిపోయింది.
Image result for pawan kalyan film chamber
ఇక పవన్ కళ్యాన్ అన్న మాటలకు తీవ్రంగా స్పందించిన ఏపీ జర్నలిస్ట్ సంఘాలు పవన్ కి వ్యతిరేకంగా నేడు విజయవాడ బెంజ్ సర్కిల్ లో ధర్నా జరగనుంది.జర్నలిస్టుల నిరసనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తుండటం గమనార్హం. కాగా, టీవీ 5, టీవీ 9, ఏబీఎన్ చానళ్లను బహిష్కరించాలని నిన్న పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. జర్నలిస్టు సంఘాల హెచ్చరికల నేపథ్యంలో బెంజ్ సర్కిల్ ప్రాంతంలో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: