టాలీవుడ్లో శ్రీరెడ్డి ఒక సెన్సేషన్. ఇండస్ట్రీలో  పడుకోకపోతే అవకాశాలు ఇవ్వరంటూ ఇండస్ట్రీ యొక్క నగ్న సత్యాలను బయటి ప్రపంచానికి తెలియజేసింది. మొదటగా తానొక్కతే  ఈ ఉద్యమానికి పురిగొల్పగా క్రమంగా తనలా విరిగి,నలిగి మోసపోయినవారు సైతం ఆమెకు సహకారం అందించడంతో కొన్ని రోజుల్లోనే ఈ ఉద్యమం తారాస్థాయికి చేరింది.


ఇంకొద్ది రోజులు ఉంటే తన పోరాటానికి ఫలితం వస్తుందని అనుకుంటుండగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను, ఆయన తల్లిని దూషించి ప్రతీ తెలుగు సినీ అభిమాని యెక్క ఆగ్రహానికి గురయింది. తనపై నీచంగా మాట్లాడిన శ్రీరెడ్డిపై పవన్ కూడా స్పందించడంతోఈ వివాదం మరింత తీవ్రమైంది. ఒకానొక సమయంలో అలా మట్లాడినందుకు ఆయన తల్లికి క్షమాపణలు తెలిపినా ఆమె పేరును ఇంకా ప్రస్తావిస్తూనే ఉంది.


తాజాగా ఆమె తన ఫేస్ బుక్లో పేజీలో "చంద్రబాబు చేస్తున్న దీక్ష నుండి జనాల దృష్టి మరల్చేందుకు అమ్మ పేరుతో నిన్న మా అసోషియేషన్ వచ్చిన నువ్వు, ఫుల్ నెగటివ్ మార్క్స్ వేయించుకొని వెళ్ళావ్, మీ అమ్మగారికి నీకంటే నేనే ఎక్కువ గౌరవం ఇస్తున్నాను. మా మహిళా విభాగానికి మీ అమ్మగారి పేరును పెట్టుకుంటాము. జై అంజనా దేవి" అంటూ రాసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: