ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న అధికార పార్టీ కొత్త తరహా ఉద్యమాన్ని చేస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నిరాహార దీక్ష చేపట్టారు.  తాజాగా ఈ దీక్షపై పలువురు రక రకాల కామెంట్స్ చేస్తున్నారు.  ఇక   వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఘోరంగా విమర్శించారు. జపాన్ తరహాలో పని చేస్తూ ఉద్యమాలు చెయ్యాలని చెప్పిన చంద్రబాబు, నిన్న తన ధర్మపోరాట దీక్షను ఆ విధంగా చేయలేదని అన్నారు.
Image result for chandrababu deeksha
అయ్యా, చంద్రబాబునాయుడుగారు! నిన్న మీరు చేసిన నిరాహారదీక్షా ఉద్యమం పని చేస్తూ చేసిన ఉద్యమమేనా? రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ పనీపాటా లేకుండా చేసి మీ ముందు కూర్చోబెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ, సీపీఐ, సీపీఎంలు, జనసేన పార్టీ మీకు మద్దతు ఇవ్వలేదు.  ఇది ముమ్మాటికి 420 దీక్ష అన్నారు.
Image result for chandrababu deeksha
ఈ దీక్షలో పాల్గొనమని చెప్పిన పార్టీల వాళ్లందరూ ద్రోహులట! ;ప్రభుత్వ సొమ్ముతో చేసిన నిరాహార దీక్ష ఇది. కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత తనపై దాడి చేస్తున్నారనే స్వరాన్ని వినిపించడానికి చంద్రబాబు నిన్న తీవ్రంగా ప్రయత్నం చేశారు.  మీరు ఏం చెబితే అది చేయడానికి మీకింద తొత్తులు ఎవ్వరూ లేరు..ఇలాంటి కుఠిల రాజకీయాలు ఇప్పటికైనా మాని ప్రత్యేక హోదా కోసం నిజంగా పోరాడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: