గత నెల రోజుల నుంచి నటి శ్రీరెడ్డి తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ వస్తున్న విషయం తెలిసిందే.  తెలుగు ఇండస్ట్రీలో సినిమా చాన్సుల కోసం వచ్చే నటీమణులను కొంత మంది దుర్మార్గులు దారుణంగా పడక సుఖం కోసం వేదిస్తున్నారని..ఒకవేళ అలా చేసినా సినిమా చాన్స్ వస్తుందో రాదో తెలియని పరిస్థితని గట్టిగా అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరిస్తున్నారని పలు ఛానల్స్ ముందు తన ఆవేదన వ్యక్తపరిచింది శ్రీరెడ్డి.
Related image
అయితే శ్రీరెడ్డికి పలువురు మహిళా సంఘాలు మద్దతు పలికారు. తాజాగా తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తోన్న సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపుతూ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌తో పాటు పలువురు సినీ పెద్దలతో ఈ రోజు చర్చలు జరిపింది. తెలంగాణ సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Image result for sri reddy jounir artist
ఈ సదంర్భంగా ఆయన మాట్లాడుతూ..సినీ పరిశ్రమలో మధ్యవర్తులు లేకుండా చూస్తామని, ఇకపై నటులకు మేనేజర్ల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు చేస్తామని చెప్పారు. మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇక ఈ వివాదాన్ని ఇక్కడితో నిలిపివేయాలని పరిశ్రమను, మీడియాను కోరుతున్నానని అన్నారు.
Image result for sri reddy jounir artist
మహిళలు, నటులు ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: