కొద్ది రోజులుగా శ్రీరెడ్డి ఉదంటంతో ప్రారంభమైన కాస్టింగ్ కౌచ్ వివాదం పవన్ కళ్యాణ్ ఉదంతంతో తీవ్రస్థాయికి చేరింది. చిత్రసీమలో 24 క్రాఫ్ట్స్ లో అవకాశాల కోసం ప్రయత్నించే వనితల 'మాన సమర్పణ' కోరే ప్రభుద్ధుల భరతం పట్టాలని దీన్ని నివారించాలనే ఆకాంక్ష ఉద్యమ రూపం సంతరించుకుంది. 
Image result for pavan srireddy
ఈ వ్యవహారం కొద్ది రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన చిత్ర పరిశ్రమ లో దుమారం రేపుతోంది. కాస్టింగ్ కౌచ్ పేరుతో ప్రసిద్ధమన ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి తెలంగాణా ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సినీరంగం అట్టుడికి వేడెక్కిపోవడం, సమస్య తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకో వాలన్న డిమాండ్లు వెల్లువెత్తడంతో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన అన్నివర్గాలతో శనివారం కీలక భేటీ జరిగింది. 

హైదరాబాద్‌లో శనివారం హోం, కార్మిక శాఖలు, షీ-టీమ్స్‌తో పాటు ‘మా’, నిర్మాతల అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని
Image result for casting couch victims in tollywood & telangana government
కాస్టింగ్ కౌచ్ తరహా వివాదాలు పునరావృతం కాకుండా, నటీనటుల హక్కులకు భంగం కలగని రీతిలో తగిన చర్యలు తీసుకునేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోం, కార్మిక శాఖలు, షీ టీమ్స్‌తో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ - మా, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 
Image result for costing couch
ప్రభుత్వం తరపున ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ - ఎఫ్‌డిసి, చైర్మన్ రాంమోహనరావు అధ్యక్షతన ఏర్పడే కమిటీ లో ఎఫ్‌డిసి, 'మా', ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, 24 క్రాఫ్ట్స్ నుంచి ఎంపిక చేసిన వారు సభ్యులుగా ఉంటారు. మంత్రి తలసాని శ్రీనివస యాదవ్ మాట్లాడుతూ కమిటీ వారం పది రోజుల్లో సమావేశమై కార్యాచరణను సిద్ధంచేసి ప్రభుత్వానికి అందిస్తే దానిపై మరోసారి అన్ని వర్గాలతో చర్చిస్తామని వెల్లడించారు. 
Image result for costing couch
ముఖ్యంగా "మహిళా ఆర్టిస్టు" లకు తగిన రక్షణ కల్పించేందుకు అవసరమయ్యే చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని స్పష్టం చేశారు. సమా వేశంలో ఎఫ్‌డీసీ చైర్మన్ రాంమోహన్రావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, కార్మిక శాఖ కమిషనర్ మహ్మద్ నదీమ్, ఎఫ్‌డీసీ ఇడి కిషోర్‌బాబు, సిఐడి ఎస్‌పి అపూర్వారావు, మా అధ్యక్షుడు శివాజీ రాజా, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్ శంకర్, చలన చిత్ర ప్రముఖులు జీవిత రాజశేఖర్, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వర రావు, జెమిని కిరణ్, సి.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Image result for talasani srinivas yadav on Tollywood casting couch
ముఖ్యంగా "మహిళా ఆర్టిస్టు"లకు తగిన రక్షణ కల్పించేందుకు అవసరమయ్యే చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తుందని స్పష్టంచేశారు. సమావేశం లో ఎఫ్‌డీసీ చైర్మన్ రాంమోహన్రావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, కార్మిక శాఖ కమిషనర్ మహ్మద్ నదీమ్, ఎఫ్‌డీసీ ఇడి కిషోర్‌బాబు, సిఐడి ఎస్‌పి అపూర్వా రావు, మా అధ్యక్షుడు శివాజీ రాజా, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్ శంకర్, చలనచిత్ర ప్రముఖులు జీవిత రాజశేఖర్, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వర రావు, జెమిని కిరణ్, సి.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Image result for talasani srinivas yadav on Tollywood casting couch

అయితే,'జాతీయ మానవ హక్కుల సంఘం' (ఎన్ హెచ్ ఆర్ డి) శ్రీరెడ్డి కేసును సూమోటోగా విచారణకు తీసుకుంది. నెడోరేపో విచారణ ప్రారంభం కావచ్చు  దీంతో ఆమెకు నైతిక మద్దతు లభించినట్లైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: