ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ముందే ఆయన మోడీని తీవ్ర పదజాలంతో దూషించారు. తన సమక్షంలోనే బాలకృష్ణ మోడీపై చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు. అంతే కాదు బాలకృష్ణ ప్రధానిపై వాడిన అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సాక్షిగా ఉన్నారు. 
Image result for hatred comments of mla balakrishna on pm modiఅందుకే బాలకృష్ణపై కేసు పెడుతూ చంద్రబాబును సాక్షిగా పెడుతామని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు. దానికి తోడు రాష్ట్రవ్యాప్తంగా బాలకృష్ణ పై నిరసన వెల్లువెత్తుతోంది. ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. పోలీసు స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 


చంద్రబాబు నాయుడు గురువారం చేపట్టిన ఒక్క రోజు దీక్షలో బాలయ్య మోడీపై విరుచుకుపడ్డారు. మోడీని ఆయన శిఖండిగా అభివర్ణించారు. మోడీని తరిమి తరిమి కొడుతామని అన్నారు. "నీకు తెలుగువాళ్ల ఆత్మఘోష వినిపించడం లేదా! ముందు తెలుగు నేర్చుకో! నీకు బాకా ఊదేవాళ్ల మాటలు వినకు. ఏపికి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి. నిన్ను కొట్టి కొట్టి తరుముతాం" అని అన్నారు. ఒక దేశ ప్రధానిని ఉద్దేశించి రాష్ట్రంలోని ఒక నియోజకవర్గ శాసనసభ్యుడు మాట్లాడే తీరు గర్హించ తగి నది అదీ ముఖ్యమంత్రి సమక్షంలో.
Image result for hatred comments of mla balakrishna on pm modi
సామ, దాన, భేద, దండోపాయాలు అంటారు కదా!  ప్రస్తుతం చివరి దశను ప్రయోగించ దలచినట్లు ఆయన పద ప్రయోగం తెలుపుతుంది. మోసం చేసిన మోడీని తరిమి తరిమి కొట్టాలని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశమంతా మోడీకి వ్యతిరేకత ఉందని అన్నారు. మోడీ విషయంలో సామ భేద దాన ఉపాయాలు వాడేశామని అవి అయిపోయాయని, ఇక దండోపాయం మాత్రమే మిగిలి ఉందని, ఇక మీదట ఆయనపై ప్రత్యక్ష యుద్ధమేనని ఆయన అన్నారు. ఇది గుజరాత్ కాదు, ఆంధ్రప్రదేశ్ అని, ఇష్టానుసారం చేస్తే సహించబోమని అన్నారు. 
Image result for hatred comments of mla balakrishna on pm modi
ఈయన్ని అచ్చొత్తిన ఆంబోతులా వదిలేశారా! మాట్లాడే తీరు వీధి గూండా కంటే ఎక్కువ రౌడీషీటర్ కంటే  తక్కువ అయినా మన శాసనసభ్యుడే అదే మన ఖర్మ 
Image result for hatred comments of mla balakrishna on pm modi"తెలుగువాళ్ల ఘోష వినిపించడంలేదా! అయితే ముందు తెలుగు నేర్చుకో! దాంతోపాటు పెద్దలను గౌరవించడం నేర్చుకో! అంతకన్నా ముఖ్యంగా భార్యను ప్రేమించడం తెలుసుకో! నీకు బాకా ఊదేవాళ్ల మాటలు వినకు!  ఏపికి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి!" అని మోడీకి హితవు చెపుతూ ఆగ్రహోదగ్దులై బాలకృష్ణ ఊగిపోయారు.
Related image
"నిన్ను కొట్టి కొట్టి తరుముతాం. బంకర్లో దాక్కున్నా కూడా లాక్కొచ్చి బాదుతాం. ఒకప్పుడు నీ బిజెపికి రెండు సీట్లు కూడా లేవు. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతులు మానేయ్. ఎవరెవరినో అడ్డం పెట్టుకుని వ్యవహారాలు సాగిస్తున్న నీవు శిఖండివి" అని ఆయన అన్నారు. 
Image result for hatred comments of mla balakrishna on pm modi
రాజధాని శంకుస్థాపనను నరెంద్ర మోడీ మట్టి, పవిత్ర జలాలను తేవడంపై కూడా బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఏం మా వద్ద మట్టీ నీళ్లు లేవా అని ప్రశ్నించారు. ఎపి పౌరుడు ఒక్కొక్కరు బిజెపి పై, మోడీ పై పోరాటం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. గతంలో బిజెపికి ఎన్టీఆర్, చంద్రబాబు భిక్ష పెట్టారని బాలకృష్ణ వ్యాఖ్యా నించారు.  (ఒక గౌతమీపుత్ర శాతకర్ణిలా మారి పోరాటం చేయాలట - ఆయన నటించిన భీతావహ చిత్రం - బావతో చెప్పి ఈ బామ్మర్ధి దానికి ప్రత్యేక షోలు అదీ వారం పాటు వేసుకున్నారు. నందులు కూడా తీసేసుకున్నారు. రాష్ట్రం వారి జాగీరు కదా!) 
Image result for hatred comments of mla balakrishna on pm modi
ఇక ధర్మపోరాట దీక్ష వేదికపై ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ శనివారం బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళన లకు దిగారు. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేయడంతో పాటు పోలీసు స్టేషన్లలలో ఫిర్యాదులు చేశారు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నర సింహారావు డిమాండ్‌ చేశారు. 
Image result for hatred comments of mla balakrishna on pm modi
శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ధర్మపోరాట దీక్ష పేరిట కోట్లాది రూపాయిల ప్రజాధనాన్ని వృథాచేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్నే కాకుండా ప్రధాని నరెంద్ర  మోదీని నిందించడానికి దీక్షను వాడుకున్నారని, టీడీపీ నేలబారు బజారు సంస్కృతిని పాటిస్తుందని అన్నారు. ఒకనాడు నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా వైసిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే రీతిలో నిందించిన సందర్భంగా టిడిపి యావరాష్ట్రం అట్టుదికేలా అల్లర్లు చేయలేదా! ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన ముసిముసి నవ్వులతో బాలకృష్ణ వ్యాఖ్యలు వారిరువురి కుటుంబాలకే అప్రతిష్ట. ఇక ప్రదాని నరెంద్ర మోడీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు రాష్ట్రానికి ఎలాంటి సహాయం చేయబోరని పరిస్థితులు చెపుతున్నాయి. స్వయాన చంద్రబాబే సుహృద్భావ వాతావరణాన్ని బ్రష్టు పట్తిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణాలో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసు మరో సారి తెరపైకి రానుందంటున్నారు.  
Image result for hatred comments of mla balakrishna on pm modi
మోదీపై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదని, ఎన్టీఆర్‌ ప్రతిష్ఠను, తెలుగుప్రజల గౌరవాన్ని ఆయన మంటగలిపారని ఆరోపించారు. ప్రధానిపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే సీఎం ముసిముసి నవ్వులు నవ్వడమేంటని బీజేపీ నేత మాణిక్యాలరావు మండిపడ్డారు.  బాలకృష్ణపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాలకృష్ణ పై బీజేపీ నేతలు గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. రెడ్‌క్రాస్‌ సేవా అవార్డుల ప్రదానానికి విశాఖ వచ్చిన గవర్నర్‌ను వారు కలిశారు. బాలకృష్ణ ప్రధానిని తీవ్రంగా దూషించా రని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ఆరోపించారు.
Image result for hatred behavior of balakrishna in public 
రాజ్యాంగ పరంగా అత్యున్నతమైన పదవిలో ఉన్న ప్రధానిని ఒక నేఱచరిత్ర ఉన్న ఎమ్మెల్యే అలా దూషించడం సమర్థనీయం కాదని, దానికి సంబంధించిన వీడియో ఫుటేజీని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.  ప్రధాని గురించి అవమానకరంగా మాట్లాడిన బాలకృష్ణతో పాటు అందుకు సాఖ్యంగా ఉన్న సీఎం చంద్రబాబు పైనా రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ రాజకుమారికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫిర్యాదును అందజేశారు. 
Image result for ap state bjp leaders
"ఆపరేషన్‌ గరుడ" మొదలైందంటూ రాష్ట్రంలో భీతావహ వాతావరణాన్ని  సృష్టించటానికి  సినీ నటుడు శివాజీ చేసిన ప్రకటనపైనా ఫిర్యాదుచేశారు. విజయవాడ బీజేపీ నగర కార్యాలయంలో బాలకృష్ణ దిష్టిబొమ్మను పాదరక్షలతో కొట్టారు. బీజేవైఎం నాయకులు హైదరాబాద్‌లో బాలకృష్ణ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆయన కారును అడ్డగించారు.  బీజేపీ  కార్యకర్తలు నెల్లూరు గాంధీ విగ్రహం సెంటర్ లో బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనంచేశారు. టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక హోదా నినాదంతో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసేందుకు చేరుకున్నారు. ఇరుపక్షాల మధ్యా మాటామాటా పెరిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు. బాలకృష్ణ మాటల్లో తప్పేముందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.

Image result for sonTineni sivaji and operation garuDa

మరింత సమాచారం తెలుసుకోండి: