జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ మధ్య ఇప్పుడు మాటల యుద్ధం జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు గత చరిత్రలు కూడా విప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఇంటిగుట్టు విప్పుతూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ సెటైర్ వేశారు. గతంలో ఆమెను తాను ఇంటర్వ్యూ చేసినప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు. 

PAWAN VS renu desai కోసం చిత్ర ఫలితం

పవన్‌తో విడాకులు ఎందుకు తీసుకున్నారని రాధాకృషణ తన ఓపెన్‌ హార్ట్‌ షోలో ప్రశ్నించాడట. అప్పుడు రేణూ ఏం చెప్పిందో తెలుసా.. ‘గాజు పెంకును ఎంతసేపని గుప్పిట ఉంచగలను? చేయి తెగదా? ’అని రేణూ దేశాయ్‌ చెప్పిందని రాధాకృష్ణ ఇప్పుడు చెబుతున్నారు. అంటే పవన్‌ కల్యాణ్‌ను ఆమె గాజుపెంకుతో పోల్చారన్న మాట ! 

PAWAN VS renu desai కోసం చిత్ర ఫలితం

శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ ను తిట్టడం.. దాన్ని మీడియా ప్రముఖంగా ప్రసారం చేయడం.. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కొన్ని మీడియా సంస్థలపై కత్తిగట్టడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ టీవీ9 రవిప్రకాశ్ ను, ఏబీఎన్ రాధాకృష్ణు టార్గెట్ చేస్తూ ట్విట్టర్ యుద్ధం చేస్తున్నాడు. ఏబీఎన్ రాధాకృష్ణనైతే.. ఏకంగా బట్టలు విప్పి మాట్లాడుకుందాం.. బట్టలూడదీసికొడదాం.. అంటూ నినాదాలు ఇస్తున్నాడు పవన్ కల్యాణ్.

renu desai open heart కోసం చిత్ర ఫలితం

పవన్‌ కల్యాణ్‌ నుంచి విడాకులు తీసుకున్న రేణూ దేశాయ్‌ తాను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ప్రకటించగానే పవన్‌ అభిమానులు ఆమెను దూషించి మానసిక క్షోభకు గురిచేయడాన్ని ఇప్పుడు ఆర్కే తన సంపాదకీయంలో ప్రస్తావించాడు. రేణూ దేశాయ్‌ కూడా ఇద్దరు పిల్లలకు తల్లి, ఇంకొకరికి కూతురే కదా! విడాకులు ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ మరో పెళ్లి చేసుకున్నప్పుడు రేణూ దేశాయ్‌ చేసుకోకూడదా? అని ప్రశ్నిస్తున్నాడు ఆర్కే. మరి ఈ ట్వీట్ల యుద్ధం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: