టీటీడీ బోర్డు నియామకం వివాదాలకు దారి తీస్తోంది. బోర్డు సభ్యులుగా వివాదాస్పద వ్యక్తులను ఎంపిక చేశారంటూ ప్రభుత్వంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసమే బోర్టు సభ్యులను ఎంపిక చేసినట్లు సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు..

Image result for ttd board

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల ఎంపిక తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్, సభ్యులుగా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు గౌతు శివాజీ, బోండా ఉమామహేశ్వరరావు, అనిత, పార్థసారధిలతో పాటు చల్లా రామచంద్రారెడ్డి, పొట్లూరి రమేష్ బాబు, రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణారెడ్డి, డొక్కా జగన్నాధం, తెలంగాణ నుంచి సండ్ర వెంకట వీరయ్య, పెద్దిరెడ్డి, కర్ణాటక నుంచి ఇన్ఫోసిస్ ఫౌండర్ సుధా నారాయణమూర్తి తో పాటు మహారాష్ట్ర నుంచి సప్న లను ఎంపిక చేశారు..

Image result for ttd board

బోర్డు సభ్యుల ఎంపిక పలు వివాదాలను రేపుతోంది. ఛైర్మన్ గా ఎంపిక చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ పైన అన్యమత కార్యక్రమాల్లో పాల్గొన్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను ఎంపిక చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. తాను క్రిస్టియన్ గా గతంలో అనిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్య మతస్థులను బోర్డు సభ్యులుగా ఎలా ఎంపిక చేస్తారంటూ సీఎం చంద్రబాబుపై పలువురు ఆరోపిస్తున్నారు. అయితే తనపై కొంతమంది కావాలనే దుష్పచారం చేస్తున్నారని అనిత ఆరోపించారు. తాను క్రిస్టియన్ కాదని... అయినా పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని తెలిపారు.

Image result for ttd board

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎంపికపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ  సెంట్రల్  నియోజకవర్గంలో  బ్రాహ్మణుల ఓటు బ్యాంకుపైనే ఉమా గెలిచాడని... అయితే వారికి ఎటువంటి మేలు చేయలేదని బ్రాహ్మణ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల్లో నియమాలు తెలియని వ్యక్తికి ఎలా పదవి కట్టబెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Image result for ttd board

బోర్డు సభ్యుల ఎంపికలో వివాదాలు రావడంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనిత తాను క్రిస్టియన్ అని చెపుకున్న వీడియోను చంద్రబాబు పరిశీలించారు. అనిత వివాదంపై ఇప్పటికే అధికారులను నివేదిక కోరినట్లుగా తెలుస్తోంది. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. హిందూ మత విశ్వాసాలకు ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం వెల్లడించారు. టీటీడీ బోర్డు మెంబర్లలో మార్పులు ఉండే అవకాశమున్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీలో 20 ఏళ్లుగా కష్టపడి పని చేసిన వారిని కాదని ఇతరులకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అన్యమతస్థులను తొలగించి... తిరుమల పవిత్రతను కాపాడాలని సీఎంను కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: