రాజ‌కీయాల్లో కోవ‌ర్టులు ఉండ‌డం స‌హ‌జం. మ‌న‌కు అనుకూలంగా మ‌న వెంటే తిరుగుతుంటారు. మ‌న‌కు అనుకూలంగా కామెంట్లు చేస్తుంటారు. మ‌న‌కు ఏమాత్రం అనుమానం రాకుండా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. కానీ, మ‌న విష‌యాల‌ను పూస‌గుచ్చి న‌ట్టు ఎదుటి పార్టీ వారికి చెప్పేస్తుంటారు. ఎదుటి వారికి లీకుల మీద లీకులు ఇచ్చేస్తుంటారు. వీరినే కోవ‌ర్టులు అంటార న్న విష‌యం కొత్త‌గా చెప్పేదేముంటుంది. వీరివ‌ల్ల రాజ‌కీయాల్లో అయితే, కూసాలు క‌దిలిపోయిన నేత‌లు ఉన్నారు. అడ్ర స్ గ‌ల్లంతైన వ్య‌క్తులూ ఉన్నారు. అయితే, తాజాగా ఇలాంటి అంశమే.. గ‌త కొన్నాళ్లుగా ఏపీ రాజ‌కీయాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు అనుకూలంగా ఉన్న కొంద‌రు వ్య‌క్తులు అధికార టీడీపీలో ఉన్నార‌ని, వారు అక్క‌డి విష‌యాల‌ను ప‌వ‌న్‌కు మోసేస్తున్నార‌ని పెద్ద ఎత్తున గుస‌గుస‌లు వినిపించాయి. 

Image result for tdp

ఇక‌, ఇప్పుడు తాజాగా ఈ కోవ‌ర్టుల గోల మ‌రింత పెరిగింద‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌వ్య‌వ‌హారం భారీ ఎత్తున వివాదంగా మారింది. న‌టి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అంటూ పెట్టిన కేకలు తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీని కుదిపేస్తున్నా యి. ఈ నేప‌థ్యంలోనే శ్రీరెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌దంగా మారాయి. దీంతో ప‌వ‌న్ ఏకంగా ఉద్య‌మానికి సిద్ధం అంటూ ప్ర‌క‌టించారు. ఈ పోరాటంలో త‌న ప్రాణాలు పోయినా లెక్క‌చేయ‌నంటూ సెంటిమెంటును పండించాడు. త‌న‌ను దూషించిన శ్రీరెడ్డి చ‌ర్య‌ల వెనుక ప‌లువురు మీడియా అధిప‌తులు ఉన్నార‌ని, దీని వెనుక ఏకంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు కుమారుడు లోకేష్ కూడా ఉన్నాడ‌ని అన్నారు. ఈ వివాదం మొత్తం భారీ ఎత్తున తీవ్రమైంది.

Related image

పవన్ కల్యాణ్ శుక్రవారం మొత్తం వరుస ట్వీట్లతో హోరెత్తించాడు. ఈ క్రమంలో  ఆయన ఒక ట్వీట్ లో ‘రేపు ఒక మీడియా యజమాని.. తన మద్దతుదారుల ప్రోద్బలంతో నాకు లీగల్ నోటీసు ఇవ్వబోతున్నారు. నేను కూడా లీగల్ ఎలా ప్రొసీడ్ కావాలో ఆలోచిస్తున్నా’ అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రేపు ఒకరు లీగల్ నోటీసు ఇవ్వబోతున్నారం టూ ముందురోజు చెప్పడం అనేది ఆయ‌న‌కు కోవ‌ర్టులు ఎవ‌రో క్లూఇచ్చార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయన చెప్పినట్లుగానే శనివారం నాడు టీవీ ఛానెల్ యజమాని శ్రీనిరాజు ఆయనకు నోటీసు పంపారు. అంటే దాని అర్థం ఏమిటి? సదరు టీవీ ఛానెల్ వారి వ్యూహాల గురించి.. పవన్ కోవర్టులు ముందుగానే ఆయనకు సమాచారం చేరవేస్తున్నారన్నమాట.


 అయితే పవన్ కోటరీ నుంచి కూడా అంతర్గత సమాచారం సేకరించడానికి మీడియా సంస్థలుగానీ, ఇతర పార్టీలు గానీ.. ఇటువంటి కోవర్టులను నియమించుకున్నాయ‌ని స‌మాచారం.  మొత్తానికి పవన్ కల్యాణ్ తన కోవ‌ర్టుల‌ను పలుచోట్ల మోహరించి ఉన్నారని.. వారి ద్వారా.. దాదాపుగా అన్ని పార్టీలు, కీలకమైన అన్ని వ్యవస్థల నుంచి ఆయనకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని వ్యాఖ్య‌లు వినిపించ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ప‌వ‌న్ వ్య‌వ‌హారం మ‌రింత ముదిరి పాకాన ప‌డుతుండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. శ్రీరెడ్డి పెట్టిన మంట భోగి మంట‌గా మారి.. తీవ్ర వివాదం సృష్టించ‌డం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: