భారత ప్రధాని నరెంద్ర మోడీ తను చెప్పదలచుకొన్నది సంక్షిప్తంగా చెప్పేస్తారు. దిశానిర్దేశాలు, మార్గదర్శనాలు, టెలికాన్-ఫరెన్సులు, పవర్-పాయింట్ ప్రజంటేషన్లు అంతగా జరిపిన దాఖలాలు తక్కువే. అధికారికంగా అంతర్గతంగా మాత్రమే వాటిని ఆయన వినియోగించుకుంటారు. తన పార్టీ సభ్యులకు మాత్రం సమయం సంధర్భం చూసుకొని కొంచాం ఘాటుగానే చురకలు వేస్తూ ఉపదేశిస్తారు. అలాంటి ఉపన్యాసమే నిన్న తన మొబైల్ యాప్ ద్వారా సంభాషించారు. ఇది మీడియాతో సంబందాలు కోరుకునే అందరికీ అవసరమే.
Image result for masala to media by modi 
Prime Minister Narendra Modi on Sunday advised BJP leaders not to give “masala” to the media by getting into every issue 

బాధ్యతారాహిత్యంగా, నోటికొచ్చింది మీడియా ముందు మాట్లాడవద్దని, మీడియాకు మనమే మసాలా ఇస్తున్నామని బీజేపీ చట్ట సభ్యులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ వ్యక్తులను ఉద్దేశించి ప్రధాని నరెంద్ర మోదీ తన మొబైల్‌ యాప్‌ ద్వారా సంభాషించారు. "కొందరు ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఇతర పార్టీ నేతలు" మీడియాతో మాట్లాడటానికి తెగ ఉవ్విళ్లూరుతుంటారు.

Image result for masala to media by modi
Stop Supplying 'Masala' To Media: PM Modi's Diktat To BJP Leaders; Raps Party Motormouths


ఏదో ఒక వివాదంలో చిక్కుకుని చివరకు తమ పార్టీకే కాకుండా తమకూ చెడ్డ పేరు తెచ్చుకుంటారు. ఈ విషయంలో మీడియాను నిందించాల్సిన అవసరం లేదు.దాని పని అది చేస్తోంది. కెమెరా ముందు నిలబడి ప్రతి విషయంలోకి దూరి, దేశానికి మార్గ దర్శనం చేయాల్సిన అవసరం మనకు లేదు. మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నవారే మీడియా తో మాట్లాడుతారు" అని నరెంద్ర మోదీ అన్నారు. "మీడియా అది చేస్తోంది,  ఇది చేస్తోందని" అంటూ మన కార్యకర్తలు ఎన్నో మాటలంటుంటారుImage result for masala to media by modi

కానీ మన తప్పులతో మనమే మీడియాకు వివాదాలను అందిస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? కెమెరా పట్టుకున్న వ్యక్తిని చూడగానే మనమేదో దేశంలోని ప్రతి సమస్య నూ విశ్లేషించగలిగే శాస్త్రవేత్తలమో? పరిశోధకులమో? అని ఫీల్‌ అయిపోతాం. మనం మాట్లాడిన దాంట్లో నుంచి వారికి ఏది అవసరమో దానినే మీడియా ప్రతినిధులు తీసు కుంటారు. మనల్ని మనమే సరైన విధంగా నియంత్రించుకోవాలి అని మోదీ హెచ్చరించారు.  


"అన్ని వర్గాల్లోనూ మన  మద్దతు దారులు పెరుగుతున్నారు. బీజేపీలో అత్యధిక మంది చట్ట సభ్యులు ఓబీసీలు, దళితులు, గిరిజనులే ఉన్నారు. వెనుకబడిన వర్గాల మద్దతు మనకు లభించినది అని అనడానికి ఇదే ఉదాహరణ" అని ప్రధాని నరెంద్ర మోదీ పేర్కొన్నారు.

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: