వర్మ చెప్పినట్టుగా నేను పవన్ ని తిట్టాను, ఇంక నా పని అయిపోయింది అంటూ ఆచూకీ లేక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది శ్రీరెడ్డి. అయితే ఏ ముహూర్తాన శ్రీరెడ్డి పవన్ ను ఆయన తల్లిని దుర్భాషలాడిందో తెలియదు కానీ ఆ వాఖ్యలకు పవన్ ఇప్పుడు స్పందిస్తున్న తీరు టీడీపీ శ్రేణులకు మరియు ఆ బూతుపురాణం వెనుక ఉన్న బృందానికి ముచ్చెమటలు పట్టిస్తుంది. 


బూతుపురాణం వెనుక ఉన్న పెద్దమనుషులను ట్విట్టర్ వేదికగా చెడుగుడు ఆడుకుంటున్నాడు. ఇప్పటికే టీవీ9 ఓనర్ శ్రీని ని, రవి ప్రకాష్ ల గుండెల్లో దడ పుట్టించిన పవన్, తాజాగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ను టార్గెట్ చేసి ఆయనకు కునుకులేకుండా చేస్తున్నాడు. ఆర్కే , నువ్వు నడిపే పేపర్ పేరు ఆంధ్రజ్యోతా?టీడీపీజ్యోతా? అని నిన్న విమర్శలు గుప్పించిన పవన్ నేడు కూడా ఆర్కే ను వదల్లేదు.


ప్రధానిని మర్యాదలేని భాషలో తిట్టి ఏపీకీ ప్రత్యేకహోదా తెప్పించే సామర్థ్యం టీడీపీ కి ఉంది. ఈ బూతు ఐడియా ఇచ్చేది ఆర్కే నే అంటూ ట్వీట్ చేశాడు. అమ్మలను-సోదరీమణులను తిట్టడానికి టీడీపీ ఏర్పాటుచేసిన బూతు విభాగానికి ఆర్కేనే  జనరల్ సెక్రటరీ అని ఇంకో ట్వీట్ చేశాడు. అంతేగాక " తిట్టడమే మా నమ్మకం" అనునది టీడీపీ నినాదం అని చురకలు అంటించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: