హీరోకైనా.. రాజ‌కీయ నాయ‌కుడికైనా ప‌బ్లిసిటీ అవ‌స‌రం! హీరోకి ప‌బ్లిసిటీ సినిమాల ద్వారా వ‌స్తే.. రాజ‌కీయ నాయ‌కుల‌కు మాత్రం మీడియా ద్వారానే వ‌స్తుంది. రావాలి కూడా. ఈ విష‌యంలో కాక‌లు తీరిన రాజ‌కీయ యోదులు కూడా  మీడియా కు దాసోహం అవ‌వ‌ల‌సిందే. ఏదైనా విష‌యంపై వివాదం ఏర్ప‌డిన‌ప్పుడు మీడియా వ‌క్రీక‌రించింద‌ని త‌ప్పించుకుంటూ.. దానిపైనే నింద‌లు వేస్తూ.. కూడా మీడియాలేకుండా మ‌న‌లేని మ‌హానుభావులే రాజ‌కీయ నాయ‌కులు.
Image result for sri reddy
రాజ‌కీయ నాయకుడికి అధికారం ఎంత ముఖ్య‌మో.. మీడియాఅంత‌క‌న్నా ముఖ్యం. ``ఆ రెండు ప‌త్రిక‌లు మేం చేస్తున్న ప‌నుల‌ను వ‌క్రీక‌రిస్తున్నాయి. మా కంటూ ఓ మీడియా ఉండి ఉంటే..`` అంటూ ఉమ్మ‌డి ఏపీ అసెంబ్లీ వేదిక‌గా దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న‌లోని లోతు ఏమిటో ఆలోచిస్తే.. తెలుస్తుంది.  పాల‌నా ప‌రంగా రాజ‌న్న అని అనిపించుకున్నా.. 108వంటి కీల‌క వాహ‌నాల‌ను ప్ర‌జ‌ల‌ను చేర‌వ చేసి శ‌భాష్ అనిపించుకు న్నా..వైఎస్‌కు మ‌న‌శ్శాంతి ద‌క్క‌లేదు. త‌న‌కంటూ సొంత‌గా మీడియా ఉండాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టి మీడియా హౌన్‌ను త‌న కుమారుడితో స్థాపించుకున్నారు.
Image result for sri reddy
ఇదీ మీడియా ప‌వ‌ర్ అంటే!! మ‌రి అలాంటి మీడియాను జ‌న‌సేనాని ప‌వ‌న్ దూరం చేసుకోవ‌డం తాజా ప‌రిణామాల క్ర‌మంలో తీవ్ర వివాదానికి దారితీస్తోంది. న‌టి శ్రీరెడ్డి రేపిన దుమారం... ఉరిమి ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్టు.. ప‌వ‌న్‌పై ప‌డింది. ప‌వ‌న్ త‌ల్లిని శ్రీరెడ్డి కామెంట్ చేసింది. దీనిని వివిధ మీడియా సంస్థ‌లు ప‌దే ప‌దే ప్ర‌సారం చేశాయి. దీనిని ప‌వ‌న్ త‌ప్పుప‌ట్టారు. మీ త‌ల్లి మీ అక్క అయితే, ఇలాగే ప‌దే ప‌దే ప్ర‌సారం చేస్తారా? అంటూ విరుచుకుప‌డ్డారు. ఆ వెంట‌నే కొన్ని ఛానెళ్ల పేర్లు చెప్పి వాటిని బ‌హిష్క‌రించాలంటూ పిలుపునిచ్చారు.

Image result for media

ఈ ఆవేశం, ఆవేద‌న ప‌వ‌న్‌కు మంచి చేయ‌క‌పోయినా.. చెడును మాత్రం వెంట‌నే తెచ్చిపెట్టాయి. ప‌వ‌న్ సెల‌బ్రిటీ కాబ‌ట్టి.. ఆయ‌న త‌ల్లిని ఓ న‌టి విమ‌ర్శించింది కాబ‌ట్టి.. మీడియా సంస్థ‌లు ప్ర‌సారం చేశాయి. ఫ‌లితంగా సంచ‌ల‌నంగా మారి.. రేటింగ్ పెరుగుతుంద‌ని ఆయా సంస్థ‌లు భావించి ఉంటాయి. అయితే, ఈ విష‌యంలో ప‌వ‌న్ ఆవేద‌న‌ను కూడా అర్ధం చేసుకోవాల్సిందే. అయితే, త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తీక‌రించుకొనే తీరు విష‌యంలోనే ప‌వ‌న్ త‌ప్ప‌ట‌డుగులు వేసేశాడు. మీడియాను హెచ్చ‌రించే విధానంలో మొర‌టు వ్యాఖ్య‌లు అందుకున్నాడు. అలా కాకుండా.. మీడియా సంయ‌మ‌నం పాటించాల‌నో.. లేదా మ‌రో సాఫ్ట్ కార్న‌రో ఎంచుకుంటే బాగుండేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 

Image result for pawan kalyan film chamber

ప్ర‌స్తుతం ప‌వ‌న్ అంటే సినీ హీరో కాదు.. ఆయ‌న ఓ పార్టీకి అధ్య‌క్షుడు., సో.. మీడియా ప్రాపు అత్యంత ముఖ్యం. ఒక‌వేళ త‌న‌కంటూ సొంత మీడియా ఉన్నా కూడా మిగిలిన మీడియా సంస్థ‌ల సాయం త‌ప్ప‌నిస‌రి. ఈ విష‌యంలో జ‌గ‌నే ఉదాహ‌ర‌ణ‌. త‌న పాద‌యాత్ర‌ను క‌వ‌ర్ చేయాల‌ని త‌నకు అతి పెద్ద మీడియా ఉన్న‌ప్ప‌టికీ.. వివిధ చానెళ్ల‌ను ఆయ‌న బ్ర‌తిమాలుకున్నారు. మ‌రి ప‌వ‌న్ ఈ విష‌యంలో ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: