మనం లైవ్ ద్వారా అనేక అంశాలు చూస్తుంటారు.. సభలు, సమావేశాలు, ఆడియో ఫంక్షన్లు ఇలాంటివి.. అదే లైవ్ లో కొన్నిడిస్కషన్లు కూడా హాట్ హాట్ గా సాగుతుంటాయి. కానీ ఓ ఘటనలో ఏకంగా లైవ్ లో ఉన్న విలేఖరినే కొందరు కాల్చి చంపేశారు. ఈ దారుణం లాటిన్ అమెరికా దేశాల్లో ఒకటైన నికరాగ్వాలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మీడియాపై దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ వార్త సంచలనంగా మారింది. 

REPORTER ANGEL GAHONA MURDER ON LIVE కోసం చిత్ర ఫలితం

అసలేంజరిగిందంటే.. ఆ దేశ అధ్యక్షుడు డేనియేల్‌ ఆర్టేగా ఇటీవల కొన్ని సంస్కరణలు ప్రతిపాదించాడు. అందులో సామాజిక భద్రతా పథకాల సంస్కరణలు ముఖ్యమైనవి. ఈ సంస్కరణలపై జనంలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు మొదలయ్యాయి. అవి కాస్తా ఘర్షణలు, బాంబు దాడుల వరకూ వెళ్లాయి. ఈ అంశాలన్నింటినీ మీడియా ఎప్పటికప్పుడు ప్రపంచానికి వెల్లడిస్తూనే ఉంది. 

REPORTER ANGEL GAHONA MURDER ON LIVE కోసం చిత్ర ఫలితం

నికరాగ్వాలోని ఓ ప్రాంతంలో జనం కోపంతో ఏటీఎంను ధ్వంసం చేశారు. ఈ వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన రిపోర్టర్ ఏంజెల్ గహోనా వెళ్లారు. అక్కడి పరిస్థితి భయంకరంగా ఉండటంతో లైవ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. తన ఛానల్లో అక్కడి పరిస్థితిని లైవ్ లో వివరిస్తుండగానే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. 

REPORTER ANGEL GAHONA MURDER ON LIVE కోసం చిత్ర ఫలితం
ఆ కాల్పుల్లో రిపోర్టర్ ఏంజెల్ గహోనా అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దారుణమంతా లైవ్ లో టెలికాస్ట్ అయ్యింది. గత బుధవారం నుంచి అక్కడ జరుగుతున్న అల్లర్లలో పాతిక మంది వరకు మరణించి ఉంటారని అంచనా. 



మరింత సమాచారం తెలుసుకోండి: