చత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో నక్సల్స్‌ కోసం సీఆర్పీఎఫ్‌ భారీ కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది.  ఈ నేపథ్యంలో సుకుమా జిల్లా చాంద్ మెట్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరిగాయి. భారీ సంఖ్యలో మావోయిస్టుల సామగ్రి, ఆయుధాలు, సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో చుట్టూ పది కిలోమీటర్ల మేర కూంబింగ్, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రతీకారంతో రగిలిపోతున్న మానోయిస్టులు దాడులకు దిగొచ్చునన్న ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో సర్వత్రా హై అలెర్ట్ కొనసాగుతోంది.
Image result for గడ్చిరోలి ఎన్ కౌంటర్
చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని ఇంద్రావతి నది తీరంలో దాదాపు 50 మంది మావోయిస్టులు ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులకు అందిన ముందస్తు సమాచారంతో మావోయిస్టుల ఏరివేత కోసం ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన సి60 కమాండోలు, సిఆర్‌పిఎఫ్ బలగాలు స్థావరాలను చుట్టుముట్టి కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అడవుల్లో 16 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీన పర్చుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున మందు గుండు సామాగ్రి, 12 ఎస్‌ఎల్‌ఆర్, 4 ఎకె 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. 
Chhattisgarh encounter: Bodies of Naxals flown to hospital
16మంది మృతు ల్లో 9 మంది పురుషులు, ఏడుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు మహారాష్ట్ర పోలీస్ వర్గాలు ప్రకటించాయి. మృ తుల్లో పెరిమిలి దళ కమాండర్, శ్రీను అలియాస్ శ్రీకాంత్ అలియాస్ రౌతు విజేందర్, డివిజన్ కమిటీ మెంబర్ సాయినాథ్ అలియాస్ డోలేష్ మాదిఆత్రంలను ఆదివారం గుర్తించగా సోమవారం మరో 9 మంది మృతదేహాలను గుర్తించారు. మహారాష్ట్రలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. పోస్ట్ మార్టం నిర్వహణ అనంతరం అప్పగింత కార్యక్రమం చేపడతారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 
Image result for గడ్చిరోలి ఎన్ కౌంటర్
దీంతో ఛత్తీస్ గఢ్‌, ఆంధ్ర , తెలంగాణా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అలర్ట్ కొనసాగుతుంది. కాగా, మృతుల్లో అహెరిదళ కమాండర్ సుమంత అలియాస్ మంగి ఉండగా ఈమెపై రూ.8 లక్షలు రివార్డు ఉంది. అదే విధంగా సుమంత అలియాస్ జెన్నీ, రాజేష్ అలియాస్ లస్కర్, తిరుపతి అలియాస్ ధర్మ, శ్రీకాంత్ అలియాస్ లాసా, రాజేష్ అలియాస్ రాజ్‌లను పోలీసులు గుర్తించారు.గడ్చిరోలి జిల్లా రాజారాం ఖాండ్లా అడవిలోని జిమాల్‌గట్ట ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఐజీ శరద్‌ షెలార్‌ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: