మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పుట్టిన రోజు ఏప్రిల్ 24 సందర్భంగా ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. సచిన్ 45వ పుట్టినరోజుకు క్రికెటర్లు, కామెంటేటర్లు, అభిమానులు తమ అభిమాన సీనియర్ క్రికెటర్‌కు విషెస్ పంపుతున్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయి ఐదేళ్లు కావొస్తున్నా ఏ మాత్రం తగ్గని అతని క్రేజ్‌కు ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు. ఈ క్రిడారంగంలో ఎంతో మంది దిగ్గజాలు ఉన్నా..ఎక్కువ శాతం సచిన్ కే ప్రాధాన్యత ఇస్తారు..దానికి కారణం సోషల్ మీడియాలో అనే చెప్పొచ్చు. 
Image result for sachin childhood
ఒకప్పుడు క్రికెట్ లో ఆడిన గొప్ప ఆటగాళ్లు ప్రింట్ మీడియాకే పరిమితం అయ్యారు..కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది క్రీడారంగానికి పెద్ద పీట వేస్తూ..సోషల్ మీడియా విపరీతమైన ప్రచారం చేయసాగింది.  ఈ నేపథ్యంలో సచిన్ ఆడే ఆట ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక భారత దేశంలో గల్లీ గల్లీలో ఈ క్రీడకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.  సచిన్ చాలా చిన్న వయసులోనే తన కెరీర్ ప్రారంభించారు..అతిరథ మహారధులతో పోటీ పడి తన పవర్ ఏంటో చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ మొత్తం 34,357 రన్స్ చేశాడు.
Image result for sachin childhood
అంతేకాదు తన బౌలింగ్‌లోనూ 200 వికెట్లు తీసుకున్నాడు. క్రికెట్ ప్రేమికుల్ని ఎంతో అలరించిన సచిన్‌కు తన ట్విట్టర్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి బర్త్‌డే విషెస్ చెప్పింది. సచిన్ ఘనతను పురస్కరించుకొని 2002వ సంవత్సరంలో టెస్ట్ క్రికెట్‌లో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ తర్వాత సచిన్ టెండూల్కర్ అంటూ విస్‌డెన్ క్రికెటర్స్ సత్కరించింది. ఇంకా వన్డే క్రికెట్‌లో వీవి రిచర్డ్స్ తర్వాత వ్యక్తి అంటూ మరో ఘనతను ఆపాదించింది. సచిన్‌ను చూసి ప్రేరణ పొందిన వాళ్లు అతని జన్మదినాన్ని గొప్పగా జరుపుకునే రోజు కావడం వాళ్లకు సంతోషదాయకం. 
Image result for sachin childhood
ఈ సందర్భంగా ఐసీసీ ట్వీట్‌లో 'లీడింగ్ టెస్ట్ పరుగుల వీరుడు, వన్డే పరుగులు యోధుడు. 200 వికెట్లతో పాటు 34,357పరుగులు తీసిన అంతర్జాతీయ క్రికెటర్. 'హ్యాపీ బర్త్ డే లిటిల్ మాస్టర్' అంటూ ట్వీట్ చేసింది. అభిమానులు, సెలబ్రెటీలు సచిన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండియాహెరాల్డ్.కామ్ సచిన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. 





మరింత సమాచారం తెలుసుకోండి: