ప్రముఖ సినీనటుడు.. మైసూర్ జిల్లాపై ప్రభావాన్ని చూపే అంబరీష్ కు బదులుగా ఆయన సతీమణి సినీనటి సుమలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలన్న మాట ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలలో వినిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అంబరీష్ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు రాహూల్ గాంధీకి తెలిపినట్లు సమాచారం.   తన ఆరోగ్యం ఏ మాత్రం బాగోకపోవటం.. ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితుల్లో తనకు బదులుగా తన భార్యకు టికెట్ ఇస్తే తప్పకుండా గెలుపొందుతారన్న ధీమా తనకు ఉన్నట్లు ఆయన తెలిపారట. 
Image result for ambarish
త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆయన అధిష్టానికి ఈ విషయం విన్నివించుకున్నారట. తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కర్ణాటక ‘కాంగ్రెస్’ నేత, ప్రముఖ సినీనటుడు అంబరీష్ ప్రకటించారు. మండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ కూడా ఇచ్చింది. కాగా, వయోభారం, అనారోగ్య కారణంగా తాను రాజకీయాల నుంచి తప్పు కుంటున్నానంటూ బీ ఫారమ్ అందుకునేందుకు ఆయన విముఖత చూపించారు.షాక్ కు గురైన కాంగ్రెస్ పార్టీ .. మండ్యా నుంచి మరో అభ్యర్థిని బరిలోకి దింపింది. 
Image result for ambarish
కాగా, వయో భారం, అనారోగ్య కారణాల రీత్యా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంబరీష్ చెబుతున్నప్పటికీ .. అసలు కారణాలు వేరే ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం. తన బదులు తన భార్య సుమలతకు టికెట్ ఇవ్వాలని అంబరీష్ చేసిన వినతిని సిద్ధరామయ్య పట్టించుకోలేదని మరో కథనం ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పారని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: