ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని సినీ నటుడు, ‘డైలాగ్‌ కింగ్‌’ సాయికుమార్‌ అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. చంద్రబాబు ధర్మదీక్ష సందర్భంగా ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన ఈవిధంగా స్పందించారు.

ప్రధాని నరేంద్రమోదీపై బాలకృష్ణ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నాడు నటుడు సాయికుమార్. ఏపీకి ప్రత్యేకహోదా కోసం తాను మోదీ కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధమేనని అన్నారు. హోదా కోసం ఆయన కాళ్లపై పడతానని మనసులోని మాట బయటపెట్టాడు. కర్ణాటక శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో చిక్ బళ్ళాపూర్ జిల్లా బాగేపల్లి నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సాయికుమార్, మంగళవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశాడు. ఎన్నికల ప్రచారానికి హీరో బాలకృష్ణను పిలవడం లేదని ఆయన తెలిపారు.

కాగా,  2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి సాయికుమార్‌ ఓటమిపాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. తన తల్లి స్వగ్రామమైన బాగేపల్లి బెంగళూరు సిటీకి దగ్గరలోనే ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంగా ఉందని, తనవంతు కృషి చేయాలన్న సంకల్పంతోనే అక్కడి నుంచి పోటీకి సిద్దమవుతున్నట్లు తెలిపాడు. 
Image result for సాయికుమార్
ప్రధాని నరేంద్ర మోడీపై బాలయ్య వ్యాఖ్యలకు సాటి నటుడిగా నేను క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. ఆవేశంలో కూడా ప్రధాని మోడీని అలా మాట్లాడకుండా ఉండాల్సింది అన్నారు సాయికుమార్.సాయికుమార్ వెంట ఆయన కుమారుడు, హీరో ఆది కూడా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: