ప్రస్తుతం టాలీవుడ్ ని షేక్ చేస్తున్న కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారిపోయింది.  మొదట చిన్న చిన్న ఇంటర్వ్యూలో ఇస్తూ కాస్టింగ్ కౌచ్ (పడక సుఖం) తెలుగు ఇండస్ట్రీలో దారుణంగా ఉందని..ఎంతో మంది అమ్మాయిలు నటించడానికి వచ్చి కొంత మంది దళారుల చేతుల్లో మోసపోతున్నారని..ఇందులో చిన్నా స్థాయి నుంచి బడా బాబుల వరకు అమ్మాయిలను ఆటబొమ్మాల్లా చూస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపిస్తూ వచ్చింది.  తర్వాత ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసిన తర్వాత ఆమె పోరాటానికి మంచి ఊపు వస్తుందన్న సమయంలో పవన్ కళ్యాన్ ఆయన తల్లిగారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో విషయం కాస్త సీరియస్ అయ్యింది.
Image result for sri reddy\
ఈ విషయంలో వర్మ ఎంటర్ కావడం..పవన్ కళ్యాన్, మీడియా ఛానల్స్ ఇలా రోజుకో టెన్షన్ ట్విస్ట్ నెలకొంటుంది.  తాజాగా కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఇండస్ట్రీలోనే కాదు..  ఆశలు, ఆశయాలకు ప్రతిరూపమైన భారత పార్లమెంటులోనూ ఉందనే మాట హాట్ టాపిక్ గా మారింది. ఈ మాట అన్నది ఎవరో కాదు… కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రేణుకా చౌదరి. క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే లేదని…. అన్ని చోట్లా ఉందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
Image result for saroj khan comments casting couch
అంతటితో ఊరుకోకుండా.. దీనికి పార్లమెంటు కూడా అతీతం కాదంటూ బాంబు పేల్చారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ రేణుక ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు కూడా దీనికి అతీతమైనదేమీ కాదని.. వ్యవహరంపై దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.  అయితే  క్యాస్టింగ్ కౌచ్ విషయంలో పార్లమెంటు కూడా అతీతం కాదంటూ ఎంపీ రేణుక ఏ కాంటెక్స్ట్ లో అన్నారో కానీ.. ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: