చంద్రబాబులాగా కుల వివాదంలో కుల పిచ్చి ఇంత ధారుణంగా ప్రదర్శించి ఇరుక్కున మరో ముఖ్యమంత్రి దేశంలో లేరంటే ఆశ్చర్యం లేదు. వెనుకబడిన తరగతుల (బీసీ) న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా తన మాయరాతలతో రహస్య నివేదికల రూపంలో బయట పడకుండా అడ్డుకునేందుకు అత్యంత తీవ్రస్థాయిలో ప్రయత్నించిన దాఖలాలు బయట పడుతున్నాయి. 


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న బీసీ న్యాయవాదులు ఈ వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తున్నారు.  అవసరమైతే ఇతర వెనుకబడిన వర్గాల వివిధ సంఘాలను ఏకతాటిపై తెచ్చి అందరిని కలుపుకుని ఈ వ్యవహారం నడపాలని వారు భావిస్తున్నారు. చంద్ర బాబు తీరును ఖండిస్తూ మొదట రాష్ట్రపతికి రం నాథ్ కోవింద్ కు లేఖ రాయాలని, తరవాత అధికారిక అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఆయనను కలవాలని భావిస్తున్నారు. 
Image result for judge eswaraiah & chandrababu
చంద్రబాబు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన అభ్యర్ధుల రహస్య నివేదికలలో వ్యక్తం చేసిన అనుచిత అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం పై ఎలా ముందుకుపోవాలో త్వరలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోని ఆయనపై సరైన నిర్ణయం ఎలా సాధించాలో అన్నదానిపై కూడా చర్చలు జరపనున్నారు. 

6 New Judges Of Hyderabad High Court Take Charge

బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా నిరోధించేందుకు కేంద్రానికి లేఖ రాసిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ వ్యవహారంలో ఏకంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమునే తప్పుబట్టారు! జస్టిస్‌ అమర్‌ నాథ్‌ గౌడ్, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి, జస్టిస్‌ పి.కేశవరావు, జస్టిస్‌ గంగారావు, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫార్సు చేస్తూ కొలీజియం తీసుకున్న నిర్ణయంపై ఆయన విస్మయకర రీతిలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
Image result for judge eswaraiah & chandrababu
న్యాయవాదుల కొలీజియం ఈ విషయం లో తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్ట్ తొందరపాటు చర్యగా అభివర్ణించారు, వేలెత్తి చూపారు. అంతేకాక ఈ ఆరుగురిని న్యాయ మూర్తులుగా పనికి రారని ఒక్క ముక్కలో తేల్చేశారు. వారి నిజాయితీ, వృత్తి పరమైన సమర్థతను నిర్ధారించకుండానే వారి పేర్లను న్యాయమూర్తుల పదవులకు సిఫార్సు చేసిందంటూ ఆయన కొలీజియంపైనే కేంద్రానికి ఫిర్యాదు చేశారు. 
Image result for BC Lawyers agitation in high court against CM chandrababu
అసలు ఈ ఆరుగురిలో ఏ ఒక్కరికి కూడా న్యాయమూర్తులయ్యేంత శ్రేష్టత, సచ్చీలత లేనేలేవని కేంద్రానికి పంపిన ఫిర్యాదు లేఖలో బాబు పేర్కొన్నారు.ఆరుగురు న్యాయమూర్తుల గురించి చంద్ర బాబు తన లేఖలో అత్యంత తీవ్ర అభ్యంతకరమైన, హర్షనీయంకాని పదజాలం ఉపయోగించిన నేపథ్యంలో సదరు లేఖను విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వంగా ఈశ్వరయ్య రెండు రోజుల క్రితం బహిర్గతం చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. 
Image result for BC Lawyers agitation in high court against CM chandrababu
ఈ లేఖను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి. రెండు రాష్ట్రాల న్యాయవాదుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ ఆరుగురి పేర్లను న్యాయమూర్తుల పదవులకు సిఫారసు చేయడం సరికాదంటూ ఒకరకంగా అభ్యర్ధులను రెచ్చగొట్టేటట్లున్న పదజాలాన్ని కూడా చంద్రబాబు లేఖలో ఉపయో గించారు. దీనిపై పలువురు విశ్రాంత న్యాయమూర్తులు తీవ్రఆశ్చర్యం, విస్మయం, షాక్ ను వ్యక్తం చేశారు. 
Image result for judge eswaraiah & chandrababu
బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడమే గాక ఏకంగా కొలీజియం నిర్ణయాన్నే తప్పుపడుతూ లేఖ రాయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన సామాజిక వర్గానికి, తన కోటరీకి చెందిన న్యాయవాదులెవరూ జాబితాలో లేరన్న అసహనం చంద్రబాబు లేఖలో స్పష్టంగా
కనిపిస్తోందని వారు చెబుతున్నారు.
Image result for six judges with justice amarnath gaud
ముఖ్యమంత్రి అసహనాన్ని, ఆయన అభిప్రాయాల్లోని ఉద్దేశాలను గుర్తించే, వాటిని పట్టించుకోకుండా అమర్‌నాథ్‌ గౌడ్‌ తదితరులను జడ్జీలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు అను మతించిందని వారు చెప్పారు. న్యాయమూర్తుల నియామకాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్న కేంద్రం ఈ ఆరుగురి విషయంలో మాత్రం ఆలస్యానికి తావులేకుండా నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: