సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి ఆ అమ్మాయిలతో పడకసుఖాన్ని అనుభవించి చివరకు సినిమాలో అవకాశం  కల్పించకుండా మోసం చేస్తూవస్తున్న బడా నిర్మాతల, మధ్యవర్తుల ఆగడాలతోవిసిగిపోయిన నటి శ్రీ రెడ్డి, కాస్టింగ్ కౌచ్ పై పోరాటాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె పవన్ ను విమర్శించడంతో ఉద్యమం మొత్తం నీరుగారిపోయింది.


ఉద్యమం ప్రారంభంలో తనతో పాటు ఉంటూ వాళ్ళకు కూడా జరిగిన చేదు అనుభవాలను వ్యక్తపరచిన తోటి ఆర్టిస్టులు సైతం పవన్ ను విమర్శించినందుకు ఆమెను ఆడిపోసుకుంటున్నారు. ఇక ఆమె కూడా అంతే స్థాయిలో విరుచుకపడుతుంది. పవన్ ను దూషించిన తరువాత న్యూస్ ఛానెళ్లలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేసిన ఆమె సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను, విమర్శలను తెలియజేస్తుంది.


మొన్న తన ఫేస్ బుక్ పేజిలో ఓర్పు, శాంతి జగన్ అన్న ఆయుధాలు అంటూ జగన్ ను ఓ రేంజిలో పొగిడేసిన శ్రీరెడ్డి నిన్న ఎమ్మెల్యే రోజాపై సెటైర్లు వేసింది. "అప్పట్లో టీడీపీ లో ఉన్నపుడు రొజాగారు సూపర్. ఆమె ధైర్యానికి నేను ఫిదా. కానీ ఈ మద్య పవన్ ని ఎందుకు పొగుడుతున్నారో అర్థంకావట్లేదు. జై జగన్ అంటే చాలు " అంటూ రాసుకొచ్చింది. అసలే ఫైర్ బ్రాండ్ అయిన రోజా ఈమె కామెంట్లకు ఎలా స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: