అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అవ్వాలని విశ్వప్రయత్నాలే చేస్తున్నాడు జగన్. ఎన్నికల వ్యూహంలోని భాగంగానే కడపజిల్లా లోని ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం లోని ఇచ్చాపురం వరకు పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. అయితే తను పాదయాత్రలో ఉంటూ పార్టీ ఇంచార్జ్ అధ్యక్షుడిగా ఎంపీ విజయసాయిరెడ్డిని నియమించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన ప్రతీ కీలకనిర్ణయాలు, హోదాపై పార్టీ తదుపరి కార్యాచరణను తెలియజేయడానికి విజయసాయి మాత్రమే మీడియా ముందుకి వస్తున్నారు.


కాగా విజయసాయిరెడ్డి మరో పాదయాత్రకు పూనుకున్నారు. తమ పార్టీ నాయకుడు జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా ఆయన విశాఖపట్టణంలో పాదయాత్ర చేయనున్నారు. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 70  వార్డుల్లో 180 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయబోతున్నట్లు ఆ పార్టీనేత మళ్ళా విజయప్రసాద్ మీడియాకు తెలిపారు.


ఈ పాదయాత్రకు మే 2 న శ్రీకారం చుడతామని, పదిరోజుల పాటు విజయసాయి యాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతేగాక ప్రత్యేకహోదా విషయంలో కుమ్మక్కయిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణములోని ప్రభుత్వ మహిళా కాలేజీకి ఎదురుగా గల దీక్షా ప్రాంగణంలో నయవంచన దీక్షలు చేయబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: