ఏపీ మంత్రి అఖిలప్రియ ఏకంగా సీఎం చంద్రబాబుపైనే ధిక్కారం ప్రకటిస్తున్నారు. సాక్షాత్తూ సీఎంతో మీటింగ్ ఉన్నా.. తాను వచ్చేది లేదంటూ సంకేతాలిచ్చారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన రాళ్ల దాడికి సంబందించిన పంచాయతీలో ఆమె మంకుపట్టు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి భూమా అఖిలప్రియను, ఆమె ప్రత్యర్దిగా ఉన్న ఎవి సుబ్బారెడ్డిని రావాలని ఆదేశించారు.

akhila priya av subbareddy కోసం చిత్ర ఫలితం
చంద్రబాబు పిలుపుతో సుబ్బారెడ్డి అమరావతి వచ్చినా అఖిలప్రియ మాత్రం రాలేదు. అంతే కాదు.. తనను రావాలని ఎవరూ చెప్పలేదని, తనకు అలాంటి సమాచారం లేదని ఆమె బదులిచ్చారు. కానీ టీడీపీ వర్గాలు మాత్రం తాము సమాచరాం ఇచ్చామంటున్నాయి. సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు అఖిలప్రియ వర్గానికి చెందినవారు రాళ్ల దాడి చేశారు. 

akhila priya av subbareddy కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు సీఎంతో సమావేశానికి అఖిలప్రియ డుమ్మా కొట్టడం అనేక సందేహాలకు తావిస్తోంది. నిజంగానే పిలుపు రాలేదా? లేక కావాలనే ఆమె హాజరుకాలేదా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి ఆఫర్ ఉన్నందువల్లే అఖిలప్రియ ఇలా వ్యవహరిస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఆమె జగన్ తో టచ్ లో ఉన్నారని కొందరు టీడీపీ నేతలు కూడా అంటున్నారు. 

akhila priya av subbareddy కోసం చిత్ర ఫలితం

మరోవైపు అఖిలప్రియకు వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు లేవని టీడీపీ అధిష్టానం అంచనాకు వచ్చినట్టు చెబుతున్నారు. తాజా సర్వేలో అఖిలప్రియకు టికెట్ ఇస్తే పరాజయం ఖాయమని తేలడంతో చంద్రబాబు ఆమెకు టికెట్ ఇచ్చే అంశంపై పురాలోచనలో పడ్డారట. అందుకే అఖిలప్రియ వైసీపీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ ఆళ్లగడ్డ రాజకీయం ఎన్నిమలుపులు తిరుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: