2014 సాధారణ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ తరువాత కొన్నాళ్లకు పార్టీ నుండి బయటికి వచ్చింది  అరకు లోక్ సభ సభ్యురాలు కొత్తపల్లి గీత. వైకాపాలో మహిళలకు ఏమాత్రం గౌరవం లేదని, తన ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే వైసీపీని వీడినట్లు ఆమె తెలిపింది. గతంలో టీడీపీ తో జత కలుస్తుంది అని వార్తలు వచ్చినా అవి రూమర్ల దగ్గరే ఆగిపోయాయి.


కాగా అప్పటి నుండి పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిపైన విమర్శలు గుప్పిస్తూ ఉంది. ఈ క్రమంలోనే మొన్న బాబు చెపట్టిన ఒకరోజు దీక్ష గురించి మాట్లాడుతూ-చంద్రబాబు దీక్షలతో ప్రజాధనం వృథా అని వ్యాఖ్యానించింది. దీంతో టీడీపీ శ్రేణులు ఆమె వాఖ్యలపై ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జెడ్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీడీపీ నేత, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆమె వ్యాఖ్యలపై స్పందించాడు.


అసలు ఎంపీ గీతకు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆమె తమ పార్టీ సభ్యురాలు కాదని తెలిపాడు. ఆమె వైఎస్సార్ సీపీ ఎంపీ అని, ఆమె మాటలను పట్టించుకోనవసరం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు చంద్రబాబు హయాంలో బీసీలకు న్యాయం జరగలేదని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్   ఈశ్వరయ్య వ్యాఖ్యానించడం సరికాదని, ప్రతీఒక్కరికి ఎలా న్యాయం చేయగలం అని  ఆయన తిరిగి ఈశ్వరయ్యకు ప్రశ్న వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: