ఆనం వివేకానంద రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి బుధవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. చంద్రబాబు గురువారం ఉదయం నెల్లూరుకు చేరుకొని ఆయనకు నివాలులు అర్పించారు. అనంతరం ఆనం కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వివేకా సోదరుడు రాంనారాయణరెడ్డిని, కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సాయంత్రం వివేక అంతిమ యాత్ర జరగనుంది.

పెన్నానది తీరంలో ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. తమ ప్రియతమ నేత ఆనం వివేకానంద రెడ్డి మరణంతో నెల్లూరు కన్నీటిసంద్రమైంది. వివేకా ఇక లేరు అనే వార్తను అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వివేకాకు నివాళి అర్పించేందుకు ఈ తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో అభిమానులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించి, కన్నీటిపర్యంతం అవుతున్నారు.
ఆనం వివేకా అసంతృప్తి
మారుమూల గ్రామాల నుంచి సైతం వివేకాను కడసారి చూసేందుకు జనాలు నెల్లూరుకు చేరుకుంటున్నారు.మరోవైపు, కాసేపట్లో నెల్లూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు రాజకీయ ప్రముఖులు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా వివేకాకునివాళి అర్పించి, కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేయనున్నారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు.

ఆనం మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆనం వివేకా మరణం రాష్ట్రానికి ముఖ్యంగా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా ప్రజలకు తీరనిలోటు అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. తన తల్లిని ఆనం కుటుంబం వారి ఆడపడచుగా భావిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వివేకా మృతి నెల్లూరు జిల్లా ప్రజలకు తీరని లోటని ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఎన్ రఘువీరా రెడ్డి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: