భారత దేశంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ శాతం డ్రైవర్ల నిర్లక్ష్యం..మద్యం సేవించి వాహనాలు నడిపించడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలుపుతున్నారు.  ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది.   గోరఖ్‌పూర్ సమీపంలోని కుషీనగర్ వద్ద పట్టాలు దాటుతున్న పాఠశాల బస్సును రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 13 మంది చిన్నారులు మృతిచెందారు. . వీరందరి వయసూ 10 సంవత్సరాల్లోపే. అందరూ ఖుషీనగర్ లోని డివైన్ పబ్లిక్ స్కూలు చిన్నారులే.

రైలు వేగానికి బస్సు నుజ్జునుజ్జయ్యింది. క్రాసింగ్‌ వద్ద కాపలాదారుడు లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ..దాదాపు 25 మందితో వెళుతున్న వ్యాన్ ను ఉదయం 6.45 – 7 గంటల మధ్య రైలు ఢీకొందని తెలిపారు. 25 విద్యార్థులతో డివైన్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు బేహపూర్వ సమీపంలో కాపాలదారుడు లేని రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ప్రమాదం జరగడంతో అక్కడ పరిస్థతి దారుణంగా తయారైంది. 

గాయపడిన వారికీ ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు.   ఇక్కడ గేటు పెట్టాలని ఎప్పటి నుంచో వేడుకుంటున్నామని తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు. ఘటన గురించి తెలుసుకొని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ మృతుల కుటుంబాలకు రూ.2లక్షల నష్టపరిహారం ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: