ఈరోజు గురువారం ఆంధ్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రోజు వైసీపీలో, బీజేపీలో పెద్దఎత్తున ఫిరాయింపులు జరిగాయి. విజయనగరంలో జిల్లాలో వైసీపీ ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీకి స్వస్తి పలికి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.


నేడు పార్వతీపురంలో మంత్రి లోకేశ్ సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు.మంత్రి లోకేష్ ఆయనకు కండువా కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. కాగా ఇదేరోజు వైసీపీలోకి కొందరు నేతలు రావడం విశేషం.  కర్నూలుజిల్లా పాణ్యం నియోజకవర్గ బీజేపీ కీలక నేత, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైసీపీలోకి రావడానికి దాదాపు అంతా ఖరారయింది.


ఈ నెల 18న పాణ్యం నాయకులు, కార్యకర్తలతో సమావేశమయిన ఆయన ఎనభై శాతం మంది వైకాపాలోకి చేరడానికి మొగ్గుచూపడం వల్లనే వైసీపీలోకి రావడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈనెల 29న విజయవాడ దగ్గరలోని  పామర్రు వద్ద పాదయాత్ర చేయబోనున్న  జగన్‌ సమక్షంలో తన అనుచరులతో కలిసి  వైకాపాలో చేరుతున్నట్లు ఆయన తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: