సివిల్‌ సర్వీస్‌ పరీక్ష-2017 ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. 2017, అక్టోబర్‌-నవంబర్‌ మధ్య నిర్వహించిన ఈ పరీక్షల్లో తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన అనుదీప్‌ దూరిశెట్టి తొలిస్థానంలో నిలిచి తన సత్తా చాటారు.   సివిల్ సర్వీసెస్- 2017 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశంలోనే నెంబర్‌ వన్ ర్యాంకును దురిశెట్టి అనుదీప్ సొంతం చేసుకున్నారు. ఈ మేరకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (UPSC) ఈ ఫలితాలను తన అధికారిక వెబ్‌ సైట్  www.upsc.gov.in లో పొందుపరిచింది. 
Image result for సివిల్స్ సర్వీస్ అనుదీప్
2017 జూన్ 18న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. పాసైన వారికి అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 మధ్యలో సివిల్స్‌ మెయిన్స్‌ ఎగ్జామ్‌ నిర్వహించింది UPSC. మూడు స్టేజీల్లో సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ ను  నిర్వహిస్తోంది UPSC. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్‌, మూడు ఇంటర్వ్యూ. మెయిన్స్ పరీక్షల్లో పాసైన వారికి ఈ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన UPSC  తుది ఫలితాలు విడుదల చేసింది.
Image result for సివిల్స్ సర్వీస్ అనుదీప్
మరోపక్క, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. శీలం సాయితేజ (43వ ర్యాంకు), నారపురెడ్డి మౌర్య (100వ ర్యాంకు), జి.మాధురి (144వ ర్యాంకు), వివేక్ జాన్సన్ (195వ ర్యాంకు), ఎడవల్లి అక్షయ కుమార్ (624వ ర్యాంకు), భార్గవ శేఖర్ ( 816వ ర్యాంకు), అమిలినేని భార్గవ్ తేజ 88వ ర్యాంకు సాధించారు. కాగా, భార్గవ్ తేజ స్వస్థలం అనంతపురం జిల్లాలోని సోమవార వాండ్ల పల్లి. ప్రస్తుతం అతను ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేస్తున్నారు.
Image result for సివిల్స్ సర్వీస్ అనుదీప్
కాగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్ 196వ ర్యాంకు సాధించాడు. మెట్‌పల్లి జిల్లాకు చెందిన సివిల్స్ టాపర్ దురిశెట్టి అనుదీప్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. సివిల్స్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించిన నిన్ను చూసి తామంతా గర్విస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అనుదీప్ తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: