`విజన్ ఫర్ ఎ బెటర్ టుమారో` అనే కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కొరటాల శివ, మహేష్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో సామాజిక అంశాలపై రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ భరత్ అనే నేను సినిమాలో అసెంబ్లీ సన్నివేశం గురించి మాట్లాడుతూ...ఆ సన్నివేశంలో మనం అసెంబ్లీలో హీనంగా బ్రతుకుతున్నాం అని హీరో  మహేష్ అనగానే పక్కనెవరో లేచి అంతమాటంటారేమిటని ప్రశ్నిస్తారని.....వాస్తవంగా నిజాలు మాట్లాడుకోవాలంటే ఈ దేశంలో ప్రాణాలకు విలువ లేదని...ఒకరంటే ఒకరికి గౌరవం లేదని కేటీఆర్ అన్నారు.

Related image

అంతేకాకుండా రోడ్డు రూల్స్ అంటే ఏమిటో కూడా తెలియని వారు కూడా ఉన్నారని అన్నారు. ఇతర దేశాల్లో అయితే అక్కడి పౌరులు ప్రతి రూల్ పాటిస్తారని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు వచ్చినా దేశంలో మార్పు రాకపోవడం ప్రజలలో మార్పు రాకపోవడం దురదృష్టకరమని అని అన్నారు. రెండుసార్లు బాబు కు గురైన జపాన్ దేశం మనకంటే ముందు దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు.

Related image

జపాన్ దేశంలో రోడ్లు అద్భుతంగా ఉంటాయి అని అన్నారు. తాను జపాన్ రాజధాని టోక్యోలో పర్యటించినప్పుడు అసలక్కడ రోడ్ మీద చెత్త కనబడలేదని పేర్కొన్నారు. అసలు తాము రోడ్లపై చెత్త వేయమని...అందుకే రోడ్లు ఇలా ఉన్నాయని తన మిత్రుడు చెప్పారని అన్నారు.

Image result for ktr

మన దేశం అధిక జనాభాగల దేశం కాబట్టి మనం ఇంకా ఎక్కువగా చాలా శుభ్రంగా ఉండాలని పేర్కొన్నారు. ఎందుకంటే చెత్త వాళ్లే ఎక్కువ అంటురోగాలు వస్తాయి..మన చుట్టుపక్కల పరిసరాలు బాగుంటే మనం బాగుంటాం అని అన్నారు. ఈ క్రమంలో చిన్నతనం నుండి పిల్లలకు పరిశుభ్రతను పాటించే విషయాలు తల్లిదండ్రులు చెబితే ఎంతో బాగుంటుందని అన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: