రాజ‌కీయాల‌కూ సినీ రంగానికి అవినాభావ సంబంధం. అస‌లు ఇప్పుడు ఏపీలో అధికారంలోఉన్న పార్టీని స్థాపించిందే.. అగ్ర‌హీరో. అన్న‌గారు ఎన్టీఆరే తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ  నినాదంతో స్థాపించిన టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉంది. మ‌రో ద‌ఫా కూడా ప్ర‌జ‌లు త‌మ‌ను ఆశీర్వ‌దించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దేప‌దే కోరుతున్నారు. దీనికి గాను ఆయ‌న చేయ‌ని జిమ్మిక్కు, వేయ‌ని ఎత్తుగ‌డ లేవంటే అతిశ‌యోక్తి అనిపించ‌క మాన‌దు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడాసినీ గ్లామ‌ర్ భారీ ఎత్తున లేక‌పోయినా.. చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రోజా.. సినీ రంగం నుంచి వ‌చ్చిన వారే. ఇప్ప‌టికీ ఆమెకుసినీ రంగంతో సంబంధాలు ఉన్నాయి. ఇప్ప‌టికీ ఆమె బుల్లి తెర‌పై రోజూ ద‌ర్శ‌నం ఇస్తూనే ఉన్నారు. ఇలా న‌ట‌నా రంగానికి రాజ‌కీయాల‌కు మ‌ధ్య చాలా అనుబంధం సంబంధ‌మే ఉంది. 

Image result for ys jagan

గ‌తంలో హీరోలు మాత్ర‌మే సినీ రంగం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవారు. ఇలా వ‌చ్చిన వారిలోనే అన్న‌గారు ఎన్టీఆర్ పార్టీ పెట్టి స‌క్సెస్ అయ్యారు. ఇక‌, ఆ త‌ర్వాత తెలుగునాట ప్ర‌జారాజ్యం పేరుతో వ‌చ్చిన అగ్ర‌హీరో మెగాస్టార్ కూడా కుదిరితే క‌ప్పుకాఫీ అన్న‌ట్టుగా సీఎం అయ్యేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే,ఆయ‌న‌ను ప్ర‌జ‌లు అంత‌గా ఆద‌రించ‌లేక‌పోయారు. దీంతో ఆయ‌న త‌న పార్టీని కాంగ్రెస్‌లో క‌లిపేసి వ్యూహాత్మ‌క రాజ‌కీయ ప‌ద‌వులు అందుకున్నారు. ఇక‌, ఆ కుటుంబం నుంచే వ‌చ్చిన మ‌రో హీరో ప‌వ‌న్ కూడా ఇప్పుడు రాజ‌కీయంగా ఓ వెలుగు వెలిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, ఈ విష‌యంలో ఆయ‌న త‌డ‌బాటు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని విమ‌ర్శ‌కులు అంటున్నారు. అయితే, ఇక‌, రాజ‌కీయాల్లో ఎంత సేపూ హీరోలేనా.. మేం మాత్రం రాజ‌కీయాల‌కు త‌గ‌మా అంటూ.. నిర్మాత‌లు సైతం రాజ‌కీయ అరంగేట్రం చ‌రిత్ర తెలుగు నేల‌పై ఉంది. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌ముఖ నిర్మాత అశ్వినీదత్ విజ‌యవాడ ఎంపీగా  టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో దిగారు. 

Image result for mla roja

బాగానే ఖ‌ర్చు చేసినా.. అప్ప‌టి వైఎస్ దెబ్బ‌కి అశ్వినీకి డిపాజిట్లు కూడాద‌క్క‌లేద‌ని అంటారు. ఇక‌, ఇప్పుడు ఈ ప‌రంపర‌లోనే నిర్మాత ఒక‌రు వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దృష్టిపెట్టిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న కుదిరితే.. ప్ర‌తిప‌క్షంవైసీపీ నుంచి పోటీచేయాల‌ని భావిస్తున్నార‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో బిజీగా ఉన్న వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌ను ఆయ‌న క‌లిశార‌ని, త‌న‌కు ఓ ఛాన్స్ ఇవ్వాల‌ని కూడా అబ్య‌ర్థించార‌ని స‌మాచారం. ఈ జిల్లాలో మొత్తం 16 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో ప్ర‌ధాన‌మైంది కృష్ణాజిల్లా కైక‌లూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం. 


ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున డాక్ట‌ర్ కామినేని శ్రీనివాస‌రావు గెలుపొందారు. అయితే, వ‌చ్చేసారి ఎన్న‌క‌ల్లో త‌న‌కుఅవ‌కాశం ఇవ్వాల‌ని డి. నాగేశ్వ‌ర‌రావు వైసీపీ అధినేత‌ను కోరుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈయ‌న సినీ రంగంలో మంచి పేరున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌. ప్ర‌ముఖ నిర్మాత‌. నిర్మాత‌గా ఈయ‌న సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీగానే ఖ‌ర్చుచేసే అవ‌కాశం ఉంది. దీనికితోడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సినీ గ్లామ‌ర్‌ను బాగా వాడుకోవాల‌ని చూస్తున్న‌జ‌గ‌న్‌కు ఈయ‌న బాగానే ఉప‌యోగ ప‌డ‌తాడ‌ని వైసీపీ వ‌ర్గాల్లోనూచ‌ర్చ న‌డుస్తో్ంది. ఈ నేప‌థ్యంలో ఈయ‌న‌కు టికెట్ ఖ‌రారు చేసే అవ‌కాశం కూడా ఉంద‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే..ఈ నిర్మాత గెలుపు ఖాయ‌మ‌ని కూడా అంటున్నారు. మ‌రి జ‌న‌గ్ ఏం చేస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: