దేశంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేదని చెప్పేందుకు ఈ ఘటన మరో నిదర్శనం. పట్టపగలు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ బాలికపై కొందరు యువకులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. రహదారిపై వెళ్తున్న బాలికను అడ్డగించి ఆమె దుస్తులు విప్పేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు బాలిక ప్రయత్నించడంతో బలవంతంగా ఆమె దుస్తులు చింపేశారు. ఆమె కాలును పట్టుకొని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. 

అన్నా..ప్లీజ్ వదలండీ అంటూ ఎంతో ప్రాదేయపడింది..అయినా ఆ దుర్మార్గులు వినలేదు. ఇదంతా అందులోని ఓ యువకుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ బాలిక శరీరంపై దుస్తులను చింపేశారు. వారి నుంచి రక్షించుకోవటానికి ఆ అమ్మాయి అలాగే రోడ్డుపై పరిగెడుతుంది. ఈ ఘటన మొత్తం వీడియో అయ్యింది. సోషల్‌ మీడియాలో పెట్టటం పెద్ద దుమారం అయ్యింది. ఈ ఘటనపై బీహార్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నయ్యర్‌ హెస్నన్‌ వెంటనే స్పందించారు.

విచారణ కోసం సిట్‌ ఏర్పాటు చేశారు. వీడియోలో రికార్డ్‌ అయిన వాహనం నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆరుగురు యువకుల్లో నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.  బాలికపై కిరాతకంగా దాడి చేయటమే కాకుండా.. వివస్త్రను చేసి పరిగెత్తించటాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: