వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి కోపం వచ్చిందట. తాను స్వయంగా ఆదేశాలు జారీ చేసినా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక అంశంలో సంచలనాలు క్రియేట్ చేసే కలెక్టర్ ఆమ్రపాలి ఈ సారి ఆధికారులపై విరుచుకు పడ్డారు. గరంలోని ఆసుపత్రుల సమీక్షలో భాగంగా సీఎంకే ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ఉర్సు ప్రసూతి ఆసుపత్రి నిర్వహణపై ఆర్ఎంఓ డాక్టర్ శివకుమార్, సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ లు తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నారని ఆమె మండిపడ్డారు.
Collector Amrapali fires at officers
మూడు వారాల క్రితం ఆసుపత్రిలో డిప్యుటేషన్ పైన ఉన్న వైద్యుల సేవలను వినియోగించుకోవాలని కాన్పులకు వచ్చే వారి కోసం స్కానింగ్ మిషన్, నీటి శుద్ధి యంత్రాలు, జనరేటర్ కోసం అంచనాలు సమర్పించాలని చెప్పినా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహించారు. తన ఆదేశాలను పాటించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేసిన ఆమె, తొలితప్పుగా భావిస్తూ ఇప్పటికి మందలించి వదిలేస్తున్నానని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

గర్భిణీలను ఆసుపత్రికి తీసుకు వచ్చి పరీక్షలు చేసిన అనంతరం ఇంటి వద్ద తిరిగి వదిలేసేందుకు 102 సేవలు అందుబాటులో ఉంచామని ఈ సందర్భంగా ఆమ్రపాలి అన్నారు. గతంలో కూడా పలువురు అధికారులు వారి పనిలో అలసత్వం ప్రదర్శిస్తే..సీరియస్ వార్నింగ్ ఇవ్వడమే కాక వారిని ఉద్యోగ విధుల నుంచి తప్పిస్తానని కూడా హెచ్చరించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: